BigTV English

Bumrah – Varun: ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్.. అతను వస్తున్నాడు !

Bumrah – Varun:  ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి  బుమ్రా ఔట్.. అతను వస్తున్నాడు !

Bumrah – Varun:  చాంపియన్స్ ట్రోఫీ 2025  ( ICC Champions Trophy 2025 ) కంటే ముందు టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ జట్టు తో జరగబోయే వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి దీనిపై చర్చ జరిగింది. సాయంత్రంలోగా ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కు సంబంధించిన టీమిండియా జట్టును బీసీసీఐ ( BCCI ) అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే… టీమిండియా అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీనికి కారణం ఆ లిస్టులో జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )  పేరు లేకపోవడమే.


Also Read: IND v ENG 2025: టీమిండియా సిబ్బందికి ఘోర అవమానం… బస్సు దగ్గరే ఆపేసి పోలీసులు రచ్చ!

అంటే ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ నుంచి టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) చోటు కోల్పోయాడు. అతని గాయం ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఉన్నాడు జస్ప్రీత్ బుమ్రా. వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల కాలంలోనే టీం ఇండియా నుంచి దూరమయ్యాడు. అయితే బుమ్రా గాయం తీవ్రతరం కావడంతో… స్కానింగ్ చేయబోతున్నారట. స్కానింగ్ రిపోర్ట్ ప్రకారం… గాయం మరింత ఎక్కువైతే… ఆపరేషన్ కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట వైద్యులు.


ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని…. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ కు… జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) ను దూరం పెట్టారట. అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో…. మిస్టరీస్ స్పిన్నర్… వరుణ్ చక్రవర్తిని ( Varun Chakravarthy ) సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఇంగ్లాండ్తో ఈనెల ఆరవ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… మిస్టరీస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేశారు.

Also Read: Shivam Dube: టీమిండియా కు లక్కీ క్రికెటర్ గా దూబే.. ఇప్పటి వరకు 30 మ్యాచ్ ల్లో గెలుపు !

ఇప్పటికే 15 మందితో కూడిన వన్డే జట్టును… క్రికెట్ నియంత్రణ మండలి…. ప్రకటించింది. అయితే ఇందులో గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో 16వ ప్లేయర్ కింద వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపింది. మొన్న ఇంగ్లాండ్ పైన జరిగిన టి20 సిరీస్ లో…మిస్టరీస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించారు. అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ చక్రవర్తి… 14 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా …. గాయం తీవ్రమై.. శస్త్ర చికిత్స వరకు వెళ్తే… ఛాంపియన్ ట్రోఫీకి అతడు దూరం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ అదే జరిగితే వరుణ్ చక్రవర్తిని బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ఆ దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×