OTT Movie : ఇప్పుడు మలయాళం సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమాలను, సింపుల్గా తెరమీద ప్రజెంట్ చేయడం మలయాళం దర్శకులకే సాధ్యపడుతోంది. రీసెంట్ గా వచ్చిన ప్రతి సినిమాను, ప్రేక్షకులు వదలకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా సింపుల్ స్టోరీ తో తెరకెక్కింది. పెళ్లి పేరు ఎత్తితే ఇంట్లో నుంచి పరిపోతూ ఉంటుంది. ఈ మూవీ చివరి వరకూ సరదాగా సాగిపోతుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘పైంకిలి’ (Painkili). 2025లో విడుదలైన ఈ మూవీకి జిత్తు మాధవన్ స్టోరీ అందించగా , శ్రీజిత్ బాబు దర్శకత్వం వహించారు.ఇందులో సజిన్ గోపు, అనశ్వర రాజన్, రోషన్ షానవాస్ ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు ఫహద్ ఫాసిల్, దర్శకుడు జిత్తు మాధవన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 14 ఫిబ్రవరి 2025న విడుదలైంది.ఈ సినిమా సంగీతం, కథ అంశాలకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా సుజిత్ కుమార్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సుకు ఒక చిన్న ప్రింటింగ్ షాప్ నడుపుతూ సాధారణ జీవితాన్ని గడుపుతాడు. అతను సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో రొమాంటిక్ కవితలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే, కొన్ని ఊహించని సంఘటనల కారణంగా, అతను చట్టపరమైన సమస్యల నుండి తప్పించుకోవడానికి, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నటిస్తాడు. ఈ నేపథ్యంలో అతను షీబా బేబీ అనే యువతిని కలుస్తాడు. షీబా తన కుటుంబం నుండి పెళ్లి ఒత్తిడిని తప్పించుకోవడానికి, ఇంటి నుండి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆమె చదువుకోవాలని కోరుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసేందుకు ఒత్తిడి చేస్తారు. సుకు , షీబా జీవితాలు ఒక ఊహించని సంఘటన వల్ల కలుస్తాయి. ఇది వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. సుకు తన నటన కొనసాగిస్తూ, షీబా తన స్వేచ్ఛ కోసం పోరాడుతూ, వీరిద్దరి మధ్య ఒక వింతైన రొమాంటిక్ బంధం ఏర్పడుతుంది. సినిమా మొదటి భాగంలో సుకు జీవితంపై దృష్టి సారిస్తే, రెండవ భాగంలో సుకు, షీబా ఇద్దరి కథలు ఆసక్తికరంగా సాగుతాయి. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే కొన్ని సంఘటనలు కథను ముందుకు నడిపిస్తాయి. చివరికి సుకు, షీబా ల లవ్ స్టోరీ ఎంతవరకూ వెళ్తుంది ? సుకు మానసిక రోగిగా ఎందుకు నటిస్తాడు. ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ మూవీని మిస్ కాకుండా చూడండి.