Samantha: ఇప్పుడు స్టార్లుగా చలామణి అవుతున్న చాలామంది హీరోయిన్లు తమ కెరీర్ మొదట్లో ఎన్నో డిశాస్టర్లు చూసే ఉంటారు. అలా కాకపోయినా అసలు ఊహించకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి తమ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేక నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కుంటూ ఉంటారు. అయితే ఇప్పటి స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ మొదట్లో ఎదుర్కున్న ఇబ్బందులను బయటపెడితే ఇప్పటి యంగ్ హీరోహీరోయిన్లకు మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అందుకే సమంత కూడా అదే పనిచేసింది. గత కొన్నేళ్లుగా హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంత.. ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది. నటీనటులను మోటివేట్ చేయడం కోసం నాగచైతన్య మూవీపై షాకింగ్ కామెంట్ చేసింది.
అలా ఫీల్ అయ్యాను
నాగచైతన్యతో హీరోగా నటించిన ‘ఏమాయ చేశావే’ మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది సమంత. ఆ సినిమాలో సమంత చేసిన జెస్సీ అనే పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆ రేంజ్‌లో తన నటనతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సామ్. ఆ సినిమా వల్లే తనకు, నాగచైతన్యకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి వరకు దారితీసింది. అలా నాగచైతన్య, సమంత.. ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆన్ స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. అయితే అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త కాబట్టి ‘ఏమాయ చేశావే’ మూవీ షూటింగ్ సమయంలో తాను ఎలా ఫీల్ అయ్యిందో వివరించింది సమంత.
ఇబ్బందిగా అనిపిస్తుంది
త్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన సమంత (Samantha).. తన నిర్మాణంలో ముందుగా ‘శుభం’ (Shubham) అనే సినిమాను తెరకెక్కించింది. ఈ మూవీ మేలో విడుదలకు సిద్ధమవుతుండగా అప్పుడే నటీనటులతో కలిసి తను కూడా ప్రమోషన్స్ ప్రారంభించింది. తాజాగా ఒక ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న సామ్.. తన మొదటి సినిమా అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ‘‘నేను నటించిన మొదటి రెండు సినిమాలు నేను ఇప్పుడు చూసుకుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నేను అంతకంటే బాగా యాక్ట్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది’’ అంటూ తన యాక్టింగ్ తనకే నచ్చలేదంటూ చెప్పుకొచ్చింది సమంత.
Also Read: ఆంటీ పాత్రలు చేయడం తప్పేం కాదు.. నటిపై సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్
నమ్మకం ఉంది
‘‘నేను నిర్మించిన శుభం సినిమాలో అందరూ కొత్త నటీనటులే. అయినా కూడ వాళ్లు చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. వాళ్ల యాక్టింగ్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఒక ఎమోషనల్ కథ ఆధారంగా తెరకెక్కిన మా శుభం సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నేను నమ్ముతాను. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ భవిష్యత్తులో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపింది సమంత. హీరోయిన్‌గా మంచి సక్సెస్ ఉన్నా నిర్మాతగా మారడానికి ఏంటి కారణమని అడగగా.. తనకు జీవితంలో ఛాలెంజ్‌లు ఎదుర్కోవడం ఇష్టమని చెప్పింది. ఇది తన కెరీర్‌లో కొత్త ప్రయాణమని తెలిపింది సమంత. మే 9న ‘శుభం’ విడుదల కానుంది.