OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో మలయాళం దర్శకులు బాగా సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులు ఈ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు.పాన్ ఇండియా సినిమాలు చేసే స్తాయికి ఈ ఇండస్ట్రీ వచ్చింది. ఒకప్పుడు చిన్న సినిమాలు మాత్రమే అక్కడి నుంచి వచ్చేవి. ఇప్పుడు పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీ లో కూడా ఈ మలయాళం సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీలో ప్రెగ్నెంట్ మహిళల్ని ఒక మంత్రగత్త టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఈ మూవీ స్టోరీ చివరి వరకు టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పల్లిమని’ (Pallimani). దీనికి అనిల్ కుంబ ఝా దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ రాత్రి సమయంలోనే ఎక్కువగా జరుగుతుంది. ఇందులో శ్వేత మీనన్, నిత్యాదాస్, కైలాష్ దినేష్, పనికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక పాత చర్చి చుట్టూ జరిగే సంఘటనలను చూపిస్తూ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. మంత్ర శక్తి కోసం గర్భిణీ స్త్రీ లను టార్గెట్ చేస్తారు. చివరి వరకూ ఈ మూవీ సస్పెన్స్ తో ముందుకు వెళ్తుంది. ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక భర్త తన ఇద్దరు పిల్లలు, గర్భిణీ భార్యతో కలిసి ప్రయాణం చేస్తుంటాడు. రాత్రి సమయం కావడంతో అతడు ఒక చర్చిలో ఆశ్రయం పొందవలసి వస్తుంది. ఆ సమయంలో వాళ్లు చర్చిలో అయితేనే సురక్షితంగా ఉంటామని అనుకుంటారు. అయితే అక్కడ వాళ్లను ఒక సీరియల్ కిల్లర్ వెంబడిస్తాడు. ఆ తరువాత ఆ ప్రాంతంలో జరిగే సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ సీరియల్ కిల్లర్ నుండి భర్త పిల్లలను కాపాడుకునేందుకు గర్భిణీ స్త్రీ చేసే పోరాటం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అయితే అదే ఊరిలో ఒక మంత్ర గత్తె శక్తుల కోసం కొంత మందిని చంపాలని అనుకుంటుంది. అందుకోసం గర్భిణీ స్త్రీలను టార్గెట్ చేస్తుంది. చివరికి గర్భిణీ స్త్రీలను ఆ వ్యక్తి ఎందుకు వెంబడిస్తాడు? అతని గతం ఏమిటి? మంత్రగత్తెకు శక్తులు వసాయా ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పల్లిమని’ (Pallimani) అనే ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి. గ్లామర్ బ్యూటీ శ్వేత మీనన్ ఈ సినిమాలో తన నటనతో అదరగొట్టింది. ఈ మూవీ మిమ్మల్ని కుర్చీలకు కట్టి పడేస్తుంది. మరెందుకు ఆలస్యం ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలసి ఈ మలయాళం మూవీ పై ఓ లుక్ వేయండి.