BigTV English

Jaggery Health Benefits: బెల్లంలో కిడ్నీకి హాని చేసే రసాయనాలు.. కొనేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

Jaggery Health Benefits: బెల్లంలో కిడ్నీకి హాని చేసే రసాయనాలు.. కొనేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

బెల్లం ఆరోగ్యానికి మంచిదే. కానీ మార్కెట్లలో బెల్లంలో కొన్ని రకాల రసాయనాలను కలుపుతున్నారు. ఈ కల్తీ బెల్లాన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. పంచదారకు బదులు బెల్లాన్ని వాడడం ఉత్తమమని అందరికీ తెలుసు. అందుకే బెల్లం అమ్మకాలు కూడా అధికంగానే ఉన్నాయి. బెల్లం ఆరోగ్యపరంగా కూడా మనకు ఎంతో సహకరిస్తుంది. ఇనుము, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది బెల్లం. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాలేయాన్ని డిటాక్స్ఫికేషన్ చేస్తుంది. రక్తహీనతను తగ్గించడంలోనూ ముందుంటుంది. అయితే బెల్లం స్వచ్ఛమైనదేనా అనే సందేహం మాత్రం ఇప్పుడు ఎక్కువైపోతోంది. ఎందుకంటే మార్కెట్లో కల్తీ బెల్లం అధికంగా లభిస్తుంది.


బెంగళూరులోని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఇటీవల కల్తీ బెల్లం అమ్మడాన్ని కనిపెట్టారు. వాటిలో వాషింగ్ సోడా, సుద్ద పొడి వంటివి కలుపుతున్నారు. అలాగే బంగారు పసుపు రంగు రావడానికి మెటానిల్ పసుపు రంగును కలుపుతున్నారు. పండుగ సమయాల్లో అమ్మే బెల్లానికే ఎక్కువగా ఇలా చేస్తున్నారు ఎందుకంటే పండుగలో కచ్చితంగా చాలా రాష్ట్రాల్లో బూరెలు, భక్ష్యాలు, బొబ్బట్లు వంటివి చేస్తారు. అందుకే అలాంటి బెల్లాన్ని తినడం వల్ల దీర్ఘకాలంలో మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంది.

ఇలా రసాయనాలు కలిపిన బెల్లాన్ని తినడం వల్ల శరీరంలో హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుతుంది. జీవక్రియ రుగ్మతలు వస్తాయి. పునరుత్పత్తి సమస్యలు వస్తాయి. క్యాన్సర్ ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మూత్రపిండాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి బెల్లం కల్తీదో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


బెల్లంలో వాడే వాషింగ్ సోడా పారిశ్రామిక ప్రయోజనాల కోసం తయారుచేస్తారు. ఇది మానవ వినియోగానికి ఏ మాత్రం సురక్షితమైనది కాదు. దీన్ని తినడం వల్ల నోరు, పొట్ట, గొంతు వంటి ప్రదేశాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వాంతులు, విరేచనాలు కూడా కావచ్చు.

మెటానెల్ పసుపుతో జాగ్రత్త

మెటానెల్ పసుపును తీసుకుంటే ఎన్నో చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. మెటానిల్ పసుపు అనేది సింథటిక్ ఫుడ్. స్వీట్లు, పసుపు, పప్పు ధాన్యాల్లో చట్ట విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. కానీ దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు. ఇది విషపూరితమైనది. మనదేశంలో కూడా దీనిపై నిషేధం ఉంది. అయితే దీన్ని అక్రమంగా వాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ మెటానిల్ పసుపు వల్ల వికారం, వాంతులు, పొట్టనొప్పి, విరేచనాలు వంటివి వస్తాయి. దీర్ఘ కాలంగా వీటిని తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. కాబట్టి బెల్లాన్ని కొనేముందు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.

Also Read: చైనా, జపాన్లో రాత్రిళ్లు మాత్రమే స్నానం చేస్తారెందుకు? ఎప్పుడు చేస్తే మంచిది?

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×