BigTV English

OTT Movie : ఆ పని కోసమే పెళ్లి చేసుకునే కసాయి… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే కూతురు

OTT Movie : ఆ పని కోసమే పెళ్లి చేసుకునే కసాయి… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే కూతురు

OTT Movie : ఫాంటసీ సినిమాలు మూవీ లవర్స్ ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్తాయి. ఈ సినిమాలలో ఉండే విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ ఫాంటసీ సినిమాలను చూడటానికి చిన్న పిల్లలతో సహా అందరూ ఇష్టపడతారు. మూవీ లవర్స్ కి మంచి కిక్కెక్కించే ఒక ఫాంటసీ హాలీవుడ్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


రెండు ఓటీటీలలో

ఈ హాలీవుడ్ ఫాంటసీ స్పానిష్ మూవీ పేరు ‘పాన్స్ లాబిరింత్‘ (Pan’s Labyrinth). ఈ ఫాంటసీ మూవీకి గుల్లేర్మో డెల్ తోరో దర్శకత్వం వహించారు.  ఇవానా బాక్యూరో, సెర్గి లోపెజ్, మారిబెల్ వెర్డు, డౌ జోన్స్, అరియడ్నా గిల్ తదితరులు ఇందులో నటించారు. ఈ మూవీని ఎస్పెరాంటో ఫిల్మోజ్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విడుదలచేశాయి. ఈ ఫాంటసీ స్పానిష్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ఆపిల్ టీవీ (Apple TV) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ కి తన తండ్రి చనిపోవడంతో, తల్లి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. హీరోయిన్ కి వచ్చిన సవతి తండ్రి చాలా క్రూరమైన వాడు. అతను మిలటరీ ఆఫీసర్ గా పని చేస్తుంటాడు. సవతి తండ్రి వల్ల హీరోయిన్ తల్లి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసమే వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాడు. అంతేగాని వీళ్ళ మీద నిజంగా అతనికి ప్రేమ కూడా ఉండదు. ఒకరోజు వీళ్లంతా ఒక ప్రాంతానికి వెళుతుండగా, హీరోయిన్ కి ఒక విరిగిపోయిన బొమ్మ కనపడుతుంది. హీరోయిన్ ఆ బొమ్మని సరి చేయగా అందులో నుంచి ఒక పురుగు బయటికి వస్తుంది. ఆ తర్వాత ఆ పురుగు హీరోయిన్ ని వెంబడిస్తూ ఉంటుంది. హీరోయిన్ ఇది గమనించి ఆ పురుగు దగ్గరకి వస్తుంది. ఆ వింత కీటకం హీరోయిన్ ని ఒక చోటికి తీసుకు వెళుతుంది. అందులో ఒక వింత ఆకారంలో ఉన్న ఒక మనిషి, హీరోయిన్ ని చూసి మహారాణి వచ్చింది అంటూ ఆనందపడతాడు.

తాను మహారాణి కాదు అంటూ అతనికి బదులిస్తుంది హీరోయిన్. మీకోసమే మహారాజు గారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారంటూ హీరోయిన్ కి చెప్తాడు ఆ వింత మనిషి. అయితే ఆమెకు రాజు దగ్గరికి చేరుకోవడానికి, మూడు పజిల్స్ దాటుకొని వెళ్లాలని చెప్తాడు. హీరోయిన్ కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. చివరికి హీరోయిన్ రాజుని కలుస్తుందా? ఆమె గత జన్మలో మహారాణిగా ఉండేదా? హీరోయిన్ సవతి తండ్రి పరిస్థితి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ఆపిల్ టీవీ (Apple TV) లలో స్ట్రీమింగ్ అవుతున్న ‘పాన్స్ లాబిరింత్’ (Pan’s Labyrinth) అనే ఈ ఈ ఫాంటసీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×