BigTV English

OTT Movie : తల్లి, కూతుర్ల రహస్య ప్రేమ కథ… మెంటలెక్కించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : తల్లి, కూతుర్ల రహస్య ప్రేమ కథ… మెంటలెక్కించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : హాలీవుడ్ నుంచి ఒక ఆసక్తికరమైన మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో తల్లి, కూతుర్ల మధ్య స్టోరీ తిరుగుతూ ఉంటుంది. తల్లి కనిపించకుండా పోవడంతో తనని వెతకడానికి కూతురు విపరీతంగా ప్రయత్నిస్తుంది. ఈ మూవీలో తల్లి, కూతుర్ల బంధాన్ని చాలా గొప్పగా చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ఎనోలా హోమ్స్‘ (Enola Holmes). నాన్సీ స్ప్రింగర్ రచించిన ది ఎనోలా హోమ్స్ మిస్టరీస్ సిరీస్‌లోని నవల ఆధారంగా, ఈ మూవీని హ్యారీ బ్రాడ్‌బీర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎనోలా తన తప్పిపోయిన తల్లిని కనుగొనడానికి లండన్‌కు వెళుతుంది. ఇందులో బ్రౌన్‌, సామ్ క్లాఫ్లిన్, హెన్రీ కావిల్, హెలెనా బోన్‌హామ్ కార్టర్ నటించారు. వాస్తవానికి వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా థియేట్రికల్ విడుదల కోసం ప్లాన్ చేయగా, COVID-19 మహమ్మారి కారణంగా ఈ మూవీ పంపిణీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. ఎనోలా హోమ్స్ సెప్టెంబర్ 23, 2020న విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించబడిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. మొదటి నాలుగు వారాల్లో 76 మిలియన్ల కుటుంబాలు ఈ మూవీని వీక్షించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఎనోలా తన తల్లితో కలిసి లైఫ్ ని సంతోషంగా గడుపుతుంది. తండ్రి చనిపోవడంతో ఎనోలా తల్లిదగ్గర గారాబంగా పెరుగుతూ ఉంటుంది. ఎనోలాకి  ఇద్దరు అన్నయ్యలు కూడా ఉంటారు. వీళ్ళు చదువుకోడానికి బయట ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఎనోలా టీనేజ్ వయసుకి వచ్చాక, ఒకరోజు ఎనోలా తల్లి కనిపించకుండా పోతుంది. కొద్దిరోజుల వరకు తిరిగి రాకపోవడంతో, తన అన్నయ్యలకు టెలిగ్రామ్ రాస్తుంది. చాలాకాలం తర్వాత వీళ్ళు చెల్లెల దగ్గరికి వస్తారు. ఒకరిని ఒకరు గుర్తు పెట్టుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. అంతలా వీళ్లకు గ్యాప్ వస్తుంది. అక్కడికి వచ్చిన అన్నదమ్ముల్లో ఒకరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉంటాడు. ఈ క్రమంలో ఎనోలా బాధ్యతలను పెద్దన్నయ్య చూసుకునే విధంగా, తల్లిని వెతికే బాధ్యత చిన్నన్నయ్య చూసుకునే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇదంతా గమనించిన ఎనోలా తన తల్లిని తానే వెతుక్కుంటూ వెళ్తుంది. ఎనోలా తల్లి లండన్ లో ఒకరికి ఎప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేది. ఆ అడ్రస్ ని ఎనోలా తెలుసుకొని అక్కడికి వెళుతుంది. అయితే అక్కడున్న వాళ్లు ఆమె ఏదైనా మంచి జరగాలని ఇలా చేసి ఉంటుందని ఎనోలాకి చెప్తారు. అప్పుడే లండన్ లో మహిళా హక్కుల కోసం పోరాటాలు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి ఎలక్షన్లు కూడా మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లిన ఎనోలాకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆమె ఎదుర్కొన్న సంఘటనలు ఏమిటి? తన తల్లిని ఎలా కనిపెడుతుంది? అన్నదమ్ములు ఈమెకు ఏ విధమైన సాయం చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ఎనోలా హోమ్స్’ (Enola Holmes) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×