OTT Movie : హారర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలకు దీటుగా ఈ వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా ఇప్పుడు వీటిని బాగా ఆదరిస్తున్నారు. హారర్ జానర్ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. హారర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఒక బెంగాలీ వెబ్ సిరీస్ ఓటీటీలో వణుకు పుట్టిస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
హోయ్‌చోయ్ (Hoichoi) లో
ఈ హారర్ వెబ్ సిరీస్ పేరు ‘పర్ణశవరీర్ శాప్'(Parnashavarir Shaap). ఇది 2023లో విడుదలైన ఒక బెంగాలీ హారర్ వెబ్ సిరీస్. సౌవిక్ చక్రవర్తి రాసిన నవల ఆధారంగా, ఈ వెబ్ సిరీస్ కి పరంబ్రత చట్టోపాధ్యాయ్ దర్శకత్వం వహించారు. ఇందులో గౌరవ్ చక్రవర్తి, అనిందితా బోస్,అర్ణ ముఖోపాధ్యాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్టోరీ నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ హోయ్‌చోయ్ (Hoichoi) ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో 2023 నవంబర్ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రేక్షకులు భయపడటానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ నలుగురు స్నేహితులు అమియో, మితుల్, టిటాస, పల్లవ్ తమ విహారయాత్ర కోసం, దార్జిలింగ్‌లోని ఒక పర్వత ప్రాంత గ్రామమైన చమక్‌పూర్‌కి వెళ్లడంతో ప్రారంభమవుతుంది. సెలవుల్లో ప్రశాంతంగా గడపడానికి వస్తే, అక్కడ వాతావరణం వీళ్ళను భయపెడుతుంది. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న మితుల్ కి ఒక దుష్టశక్తి ఆవహిస్తుంది. అప్పుడు తనను తాను హాని చేసుకోవడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆ గ్రామంలో వరుస మరణాలు కూడా సంభవిస్తాయి. ఈ వాతావరణం వీళ్ళను మరింత భయంపెడుతుంది. ఈ దుష్టశక్తి నుండి మితుల్‌ను కాపాడేందుకు, అమియో ప్రఖ్యాత ఆకల్ట్ నిపుణుడైన భదూరీ మషాయ్ సహాయం కోరుతాడు. భదూరీ మషాయ్ తన అతీంద్రియ శక్తులతో ఈ శాపం వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొంటాడు. ఎవరో ప్రకృతి దేవత అయిన దేవి పర్ణశవరీకి, నరబలి ఇచ్చి ఆమె వినాశకర శక్తులను మేల్కొల్పారని తెలుస్తుంది.
ఈ శాపం నుండి విముక్తి పొందేందుకు భదూరీ మషాయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఈ పని వారందరి జీవితాలు ప్రమాదంలో పడేలా చేస్తాయి. చివరికి దుష్టశక్తి నుంచి ఆ నలుగురు బయట పడతారా? అక్కడ నరబలి ఇచ్చింది ఎవరు ? భదూరీ మషాయ్ వీళ్ళకు ఏ విధంగా సహాయ పడతాడు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, బెంగాలీ హారర్ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్‌లతో రూపొందింది. సినిమాటోగ్రఫీ, నటన, దర్శకత్వం కారణంగా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఒక మంచి హర్రర్ వెబ్ సిరీస్ చూడాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సిరీస్ గా చెప్పుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ సిరీస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.