OTT Movie : భాషతో ప్రమేయం లేకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో ఆత్మల నేపథ్యంలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు చివరి వరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక ఊరు ఆత్మలతో నిండి ఉంటుంది. తన తండ్రి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన వ్యక్తి, ఆ ఊరిలో ఉన్న ఆత్మలను ఎదుర్కొనే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
2024 లో రిలీజ్ అయిన ఈ మెక్సికన్ మ్యాజికల్ మూవీ పేరు ‘పెడ్రో పరామో’ (Pedro Paramo). ఈ మూవీని 1955 లో జువాన్ రుల్ఫో రాసిన నవల ఆధారంగా, మాటియో గిల్ రాసిన స్క్రీన్ ప్లే నుండి రోడ్రిగో ప్రిటో దర్శకత్వం వహించారు. ‘పెడ్రో పరామో’ 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 7 సెప్టెంబర్ 2024న వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. ఈ మూవీ6 నవంబర్ 2024 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ప్రకాష్ అనే వ్యక్తి, బాగా డబ్బున్న దుర్గ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొడుకు పుట్టిన తర్వాత కొంతకాలానికి, భార్య, కొడుకును ఇంటి నుంచి తరిమేస్తాడు. వాళ్లు అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్లి బతుకుతూ ఉంటారు. కొంతకాలానికి దుర్గ కొడుకు విక్రం పెద్దవాడు అవుతాడు. తల్లి అనారోగ్యంతో చనిపోతూ, ప్రకాష్ మనకు చేసిన అన్యాయానికి పగ తీర్చుకోవాలని విక్రమ్ కి చెప్పి మరీ చనిపోతుంది. తండ్రి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని విక్రమ్, ప్రకాశ్ ఉండే ఊరికి వస్తాడు. అయితే ఆ ఊరు తన తల్లి చెప్పిన దానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. తన తల్లి పచ్చని పొలాలతో ఆ ఊరు కలకలలాడుతూ ఉంటుందని చెప్తుంది. అయితే ఇప్పుడు ఆ ఊరు ఒక నిర్మానుష్యంగా, ఎడారి ప్రాంతంలా అనిపిస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఆ ఊరికి వచ్చిన విక్రమ్ కి అందులో కనిపించే వాళ్లంతా ఆత్మలని గ్రహిస్తాడు.
అయితే ఆత్మలు ప్రకాష్ తో మాట్లాడుతూ ఉంటాయి. అన్నా,చెల్లెళ్ల అక్రమ సంబంధం, కూతురు పై తండ్రి అఘాయిత్యం లాంటి ఘటనలతో ఆ ఊరు వినాశనం కొని తెచ్చుకుంటుంది. ప్రకాష్ ఒక ఉమనైజర్ అని తెలుసుకుంటాడు విక్రమ్. తన తండ్రి ప్రకాష్ ఆ ఊర్లో మొదట డబ్బు కోసం సుశీల అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా చనిపోతుంది. ఆ తర్వాతనే దుర్గని చేసుకుంటాడు. వాళ్ళని కూడా ఇంట్లో నుంచి తరిమేస్తాడు. పగ తీర్చుకుందాం అని వస్తే, విక్రమ్ కి అక్కడ ఉన్న వాళ్ళంతా దయ్యాలుగా కనిపిస్తారు. చివరికి విక్రమ్ తండ్రి మీద పగ తీర్చుకుంటాడా? ఆ ఊర్లో ఉన్న దయ్యాలతో సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.