BigTV English

OTT Movie : అమ్మాయిల శరీరంతో పర్ఫ్యూమ్… వీడెక్కడి సైకో కిల్లర్ రా సామీ

OTT Movie : అమ్మాయిల శరీరంతో పర్ఫ్యూమ్… వీడెక్కడి సైకో కిల్లర్ రా సామీ

OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని స్టోరీలు కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక వ్యక్తి అమ్మాయిలను చంపి, వాళ్ళ శవాలతో పెర్ఫ్యూమ్ ని తయారు చేస్తాడు. ఆ పెర్ఫ్యూమ్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని పీలిస్తే ఒక రకమైన మైకంలో తేలిపోతారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పెర్ఫ్యూమ్: ది స్టోరీ ఆఫ్ ఎ మర్డరర్’ (Perfume : the story of a murderer). ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి టామ్ టైక్వెర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బెన్ విషా, అలాన్ రిక్‌మాన్, రాచెల్ హర్డ్-వుడ్, డస్టిన్ హాఫ్‌మన్ నటించారు. 18వ శతాబ్దపు ఫ్రాన్స్‌లో సెట్ చేయబడిన ఈ మూవీ పరిపూర్ణ సువాసన కోసం ఒక సైకో చేసే అన్వేషణ గురించి చెబుతుంది. ఈ మూవీ చిత్రీకరణ స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్‌లలో జరిగింది. ఈ సినిమా 50 మిలియన్ల బడ్జెట్‌తో నిర్మించిన అత్యంత ఖరీదైన జర్మన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జైలు అధికారులు ఒక వ్యక్తిని ఉరితీయాలి అనుకుంటారు. ఉరి తీసే ముందు అతని కాళ్లు చేతులు కూడా విరిచేయాలనుకుంటారు. అలా ఎందుకు చేయాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. ప్యారిస్ నగరం లోని ఒక ఫిష్ మార్కెట్లో ఒక మహిళ ప్రెగ్నెంట్గా ఉంటుంది. ముగ్గురు పిల్లలు పుట్టి వెంటనే చనిపోతారు. నాలుగో పిల్లవాడు కూడా ఉలుకు పలుకు లేకపోవడంతో అతన్ని కూడా  ఒకచోట పడేస్తుంది. అప్పుడు ఆ పిల్లాడు ప్రాణాలతో బయటపడతాడు. ఈ పిల్లాడిని ఎవరైనా వదిలేస్తే, వాళ్ళు చనిపోతూ ఉంటారు. అతనిని వదిలేసిన తల్లి ప్రమాదవశాత్తు చనిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లోడు ఒక అనాధ శరణాలయంలో పెరుగుతూ ఉంటాడు. అక్కడ స్థలం సరిపోకపోవడంతో జాక్ ను ఒక కసాయి వాడికి అమ్మేస్తుంది వార్డెన్. అప్పుడు వార్డెన్ వేరే వాళ్ల చేతిలో హత్యకు గురవుతుంది. జాక్ కు ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. వాసనను పసిగట్టే శక్తి ఉంటుంది. అతని టాలెంట్ చూసిన ఒక వ్యక్తి కసాయి వాడికి డబ్బులు ఇచ్చి మరీ కొంటాడు. ఇతను పెర్ఫ్యూమ్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతని దగ్గర అన్ని మెలకువలు తెలుసుకుంటాడు జాక్.

అయితే ఎక్కువ ఖరీదైన 13 రకాల పెర్ఫ్యూమ్లను తయారు చేయడం మొదలుపెడతాడు జాక్. అందుకు అమ్మాయిల శరీరంతో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుందనుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ ఊరిలో ఉండే కొంతమంది అమ్మాయిలను చంపి వాళ్ళ శరీరాలతో  పర్ఫ్యూమ్ ని రెడీ చేస్తాడు. ఆ తర్వాత అధికారులు అతన్ని అరెస్టు చేస్తారు. ఇప్పుడు ఉరి కూడా తీయాలనుకుంటారు. అయితే అతడు తయారుచేసిన పెర్ఫ్యూమ్ ణి ప్రజలపై విసురుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతన్ని దేవుడిలా చూస్తారు. అక్కడినుంచి జాక్ తప్పించుకుని వేరే చోటికి వెళ్తాడు. చివరికి జాక్ ను ఉరి తీస్తారా? ఆ పర్ఫ్యూమ్ తో ఏం చేస్తాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ‘పెర్ఫ్యూమ్: ది స్టోరీ ఆఫ్ ఎ మర్డరర్’ (Perfume : the story of a murderer) అనే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×