BigTV English

Parthiban- Seetha: సీతను మర్చిపోలేదు.. 24 ఏళ్లుగా సింగిల్ గానే..

Parthiban- Seetha: సీతను మర్చిపోలేదు.. 24 ఏళ్లుగా సింగిల్ గానే..

Parthiban- Seetha: సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్.. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు సైతం మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. ఈమధ్య విరాకులు తీసుకుంటున్న జంటలు సడన్గా షాక్ ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగి ఈరోజు మేము విడిపోతున్నాం అంటూ జంటలు అనౌన్స్ చేయడం కొందరు అభిమానులకు మింగురు పడడం లేదు. ఇప్పటికే చాలామంది జంటలు విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. తాజాగా తన భార్యపై ప్రేమతో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న ఓ నటుడు ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయట పెట్టాడు. ఆయన మరెవ్వరో కాదు.. పార్తీబన్.. ఈయన నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా.. దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా, దాదాపు 14 సినిమాలకు నిర్మాతగా పని చేశాడు.. ప్రస్తుతం నటుడుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని సంచలన నిజాలను బయట పెట్టాడు..


తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి బయట పెట్టాడు. డైరెక్టర్‌గా నా మొదటి సినిమా పుదియా పాడై.. సీత అందులో హీరోయిన్ గా నటించడం వల్లే మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది అలా కొద్ది రోజులు బాగానే ఉంది ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకుంన్నాం. పెళ్లయ్యాక కొంతకాలం పాటు ఆమె సినిమాలు చేయలేదు. సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయొద్దన్నారు. సరేనని ఊరుకున్నాను. తర్వాత కొంతకాలానికి తనకే ఆసక్తి వచ్చి మళ్లీ యాక్టింగ్‌ మొదలు పెట్టింది.. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఫిక్స్ అయ్యి విడాకులు తీసుకున్నాం.. అప్పుడు మేము కలిసున్న ఇంటిని అమ్మేశాం. ఇంతవరకు మళ్లీ ఇల్లు కొనలేకపోయాను.. ఇప్పటికి ఇల్లు కొనాలనే ఆలోచన రాలేదని అన్నారు..

Also Read : నాకు గాయాలైన బన్నీ వదల్లేదు.. నిజాలను బయటపెట్టిన కొరియోగ్రాఫర్..


సీత అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను. అందుకే ఆమె తర్వాత 24 ఏళ్ల అయినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉన్నానని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. నా భార్యగా సీతకు స్థానమిచ్చాను. దాన్ని మరొకరికి ఇవ్వలేను. ఇద్దరమ్మాయిలకు పెళ్లయింది. నా కొడుకు​, నేను మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటున్నాము. సీతతో నేను టచ్‌లో లేను. ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్లి దగ్గరుండి అన్నీ కార్యక్రమాలను నా చేతుల మీదుగా జరిపించాను అని ఆయన చెప్పుకొచ్చాడు. 1990లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కూతుర్లు పుట్టారు. ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు కావడంతో అబ్బాయితో ఒంటరిగానే ఉంటున్నాడు పార్తీబన్.. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులిచ్చినట్లు తెలుస్తోంది. ఈయన నటించిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×