OTT Movies : హారర్ సినిమాలకు ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. రియల్ స్టోరీల తో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు నిరాజనం పలుకుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త హారర్ కథా చిత్రాలను చూసేందుకు ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు అలాంటి లు విడుదలవుతాయా అని కొందరు వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారికోసం అదిరిపోయే మూవీని తీసుకొని వచ్చాము. భయంకరమైన హారర్ సినిమా చూడాలి అనుకొనేవారి కోసం ఓ మూవీ ఉంది. అదే పిండం. సరికొత్త కథతో, ఊహకు అందని క్లైమాక్స్ తో వచ్చిన మూవీ ఇది. దీని స్టోరీ, ఓటీటీ వివరాలు తెలుసుకుందాం..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఓటీటీలో రిలీజ్ అయ్యేఅన్ని జానర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాంటి హారర్, థ్రిల్లర్ కథతో వచ్చిన సినిమాలల్లో ఒకటి పిండం. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ మూవీ పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఇందులో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కుషీ రవి ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..1930 లో తెలంగాణ నల్గొండలో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆ స్టోరీతో సినిమాను తెరకెక్కించారు. సినిమా స్టోరీ భయంకరంగా ఉండటంతో ఎక్కువ మంది దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. డిసెంబర్ 15,2023 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. శ్రీరామ్ కు ఈ మూవీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఆహా, అమెజాన్ ఓటీటీ..
పిండం గర్భంతో ఉన్న ఆడవాళ్లు చూడొద్దు అని కూడా మేకర్స్ తెలిపారు. ఈ మూవీని రెండు ఓటీటీల్లోకి తీసుకొని వచ్చారు. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కొంతమంది ఈ భయపెట్టింది అంటుంటే.. మరికొంతమంది అంత భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఏది ఏమైన మూవీ మాత్రం సక్సెస్ టాక్ ను అందుకుంది. హారర్ సినిమాలను చూడాలి అనుకొనేవాళ్లు దీన్ని చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఈ రెండు ఓటీటీ సంస్థలు కూడా మంచి పాపులారీటిని సొంతం చేసుకున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా హారర్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.
గత కొన్ని రోజులుగా ఆహాలో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా కొత్త సినిమాలతో పాటుగా డబ్బింగ్ సినిమాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటి సంగతి పక్కనపెడితే థియేటర్లలోకి రావడానికి బోలెడు సినిమాలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ చిత్రాల్లో ఏది హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి…