OTT Movie : మైనేలోని ఒక సైలెంట్ సిటీ… చల్లని రాత్రి. ఊబకాయంతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన కారులో ఒంటరిగా ఉన్నాడు. అతని ముఖంలో భయం కనిపిస్తుంది. అతని శరీరం రోజురోజుకూ క్షీణిస్తోంది, బరువు వేగంగా తగ్గుతోంది. అతను ఎంత తిన్నా, ఆ బరువు తగ్గడం ఆగదు. ఒక భయంకరమైన శాపం అతనిని వెంటాడుతోంది. ఈ శాపం నుండి అతను తప్పించుకోగలడా? లేక ఈ రహస్యమైన శక్తి అతన్ని నాశనం చేస్తుందా? అసలు ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
బిల్లీ హాలెక్ ఒక సక్సెస్ ఫుల్ న్యాయవాది. కానీ ఊబకాయంతో బాధ పడుతూ ఉంటాడు. తన భార్య హెడీ, కుమార్తె లిండాతో కలిసి మైనేలోని ఫెయిర్‌వ్యూ అనే చిన్న పట్టణంలో నివసిస్తాడు. ఒకరోజు రాత్రి, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అతను అనుకోకుండా ఒక జిప్సీ మహిళను ఢీ కొడతాడు. ఆమె స్థానిక జిప్సీ గుండా ట్రావెల్ చేస్తున్న బృందంలోని మెంబర్. ఈ యాక్సిడెంట్ లో అక్కడికక్కడే చనిపోతుంది.
బిల్లీ తన ఇన్ఫ్లూయెన్స్ ను ఉపయోగించి, ఈ కేసు నుండి తప్పించుకుంటాడు. కానీ ఆమె తండ్రి, వృద్ధ జిప్సీ నాయకుడు తాడ్జుస్జ్ లెమ్కే… బిల్లీని ఒక పవర్ ఫుల్ పదంతో శపిస్తాడు. ‘థిన్నర్’ అనే పదాన్ని చెప్పి అతని గుండెను తాకుతాడు. కానీ బిల్లీ అతన్ని లైట్ తీసుకుంటాడు. అయితే రోజులు గడిచే కొద్దీ, బిల్లీ బరువు ఊహించని విధంగా తగ్గడం మొదలవుతుంది. ఎంత తిన్నా లావే అవ్వడు. దీంతో అతను భయపడిపోయి డాక్టర్లను సంప్రదిస్తాడు. కానీ డాక్టర్స్ కు కూడా ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు.
ఈ క్రమంలో బిల్లీ తన శాపం గురించి తెలుసుకుంటాడు. ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి జిప్సీ బృందాన్ని వెతకడం మొదలుపెడతాడు. అందుకోసం అతను తన స్నేహితుడు డాక్టర్ మైక్ హౌస్టన్ సహాయం తీసుకుంటాడు. అంతేకాదు తన మాజీ క్లయింట్, గ్యాంగ్‌స్టర్ అయిన రిచీ “ది హామర్” జినెల్లీని సంప్రదిస్తాడు. అతను జిప్సీలను బెదిరించడంలో సహాయపడతాడు. ఎట్టకేలకు బిల్లీ జిప్సీ బృందాన్ని కనిపెడతాడు. కానీ లెమ్కే శాపాన్ని తొలగించడానికి నిరాకరిస్తాడు. బిల్లీ చేసిన తప్పిదానికి శిక్ష అనుభవించాలని పట్టుబడతాడు. బిల్లీ తన కుటుంబాన్ని రక్షించడానికి, శాపం నుండి బయటపడటానికి ఒక ప్రమాదకరమైన పని చేస్తాడు. ఇది అతని జీవితాన్ని, అతని చుట్టూ ఉన్నవారిని శాశ్వతంగా మార్చేస్తుంది. ఇంతకీ అతని శాపం తొలగిందా లేదా? బిల్లీ చేసిన తప్పేంటి? దిమ్మతిరిగే క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
ఏ ఓటీటీలో అందుబాటులో ఉందంటే ?
హారర్, సస్పెన్స్ అంశాలతో గుండెల్లో గుబులు పుట్టించే ఈ మూవీ పేరు ‘Thinner’. 1996లో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది. IMDbలో ఈ మూవీకి 5.8 రేటింగ్ ఉంది. ఇందులో రాబర్ట్ జాన్ బర్క్, జో మాన్టెగ్నా, లూసిల్లె గిల్లీ, మైఖేల్ కాన్‌స్టాంటైన్ , బెథనీ జోయ్ లెంజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి టామ్ హాలండ్ దర్శకత్వం వహించారు.