Prabhakar Rao: SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 14 నెలల తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రభాకర్‌రావు హాజరుకానున్నారు. ఇదే కేసులో అరెస్టైన ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రభాకర్‌రావును ప్రశ్నించబోతోంది. సిట్ టీమ్. ప్రభాకర్‌రావు ద్వారా రాబట్టే అంశాలతో… ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొలిక్కి వస్తుందని సిట్ భావిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన తర్వాత.. ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ప్రభాకర్ రావు పాస్ట్‌పోర్టును రద్దు చేసింది. అయితే.. మే 29న ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ పునరుద్ధరించాలని, ట్రావెల్ వీసా జారీ చేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు వీలు వీలు కల్పించాలనే ఉద్దేశంతో.. సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. అయితే.. భారత్‌కు వచ్చేందుకు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్ వచ్చాక.. 3 రోజుల్లోగా హైదరాబాద్‌కు వచ్చి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
బీఆర్ఎస్ హయాంలో SIB కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు 2024, మార్చి 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావే. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్‌కు తిరిగి వస్తానని గతంలో హైకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్‌రావు. కానీ.. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారాయన. సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణకు హాజరవుతున్నారు.
ప్రభాకర్ రావు 14 నెలలుగా అమెరికాలో ఉన్నారు. ఆయనపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. నాంపల్లి కోర్టు ఆయనకు వ్యతిరేకంగా ప్రొక్లెమేషన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ నెల 20 లోపు ఆయన గనక విచారణకు హాజరుకాకపోతే.. అధికారికంగా ప్రకటించిన నేరుస్తుడిగా.. ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి.. వీసా ప్రక్రియ పూర్తికావడంతో.. ఆయన ఇండియాకు వచ్చి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.
Also Read: మాగంటిని చూడగానే.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇప్పటికే రివ్యూ నిర్వహించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు ఇంకొన్ని ఆధారాలను ప్రభాకర్ రావు ముందు ఉంచి.. సిట్ టీమ్ విచారించనుంది. వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో ప్రభాకర్ రావును విచారించనున్నారు. ప్రభాకర్ రావు నోరు విప్పితే.. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఎస్ఐబీ నిధులను కూడా పక్కదారి పట్టించారే ఆరోపణలు ప్రభాకర్ రావుపై ఉన్నాయి.