BigTV English

OTT Movie : బ్రతికుండగానే చచ్చినట్టు నటించి సైకో డాక్టర్ చేతికి చిక్కే హీరోయిన్… కిక్కెక్కించే కిల్లర్ మూవీ

OTT Movie : బ్రతికుండగానే చచ్చినట్టు నటించి సైకో డాక్టర్ చేతికి చిక్కే హీరోయిన్… కిక్కెక్కించే కిల్లర్ మూవీ

OTT Movie : ఓటీటీలో ఒక హారర్-థ్రిల్లర్ మూవీ అదరగొడుతోంది. ఈ సినిమా సస్పెన్స్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది. తనకు తానే చనిపోయేలా ఇంజెక్ట్ చేసుకునే అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్లే డెడ్’ (play Dead). 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి పాట్రిక్ లస్సియర్ దర్శకత్వం వహించారు. ఇందులో బైలీ మాడిసన్, జెర్రీ ఓ’కానెల్, ఆంథోనీ టర్పెల్, క్రిస్ లీ, క్రిస్ బట్లర్, జోర్జ్ గార్సియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ఒక క్రిమినాలజీ విద్యార్థిని, ఆమె సోదరుడిని రక్షించడానికి, ఒక అసాధారణమైన సాహసం చేస్తుంది. ఈ క్రమంలో స్టోరీ ఎన్నో మలుపులు తిరుగుతుంది.  1 గంట 46 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 5.3/10 రేటింగ్ ను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

క్లోయ్ ఆల్బ్రైట్ ఒక క్రిమినాలజీ విద్యార్థిని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటుంది. ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్న తర్వాత, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు రాకపోవడంతో, క్లోయ్, ఆమె సోదరుడు టీ.జే. తమ ఇంటిని కోల్పోయే ప్రమాదంలో ఉంటారు. ఈ ఆర్థిక పరిస్థితి నుండి బయటపడడానికి, క్లోయ్ ప్రియుడు రాస్, టీ.జే కలసి ఒక స్థానిక డిస్పెన్సరీని దోచుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇంతలో ఈ దొంగతనం విషాదకరంగా ముగుస్తుంది. రాస్ షాపు యజమాని చేతిలో చనిపోతాడు. టీ.జే. ప్రాణాలతో బయట పడతాడు. అయితే రాస్ ఫోన్‌లో టీ.జే.తో ఉన్న టెక్స్ట్ మెసేజ్‌లు ఈ నేరానికి అతన్ని లింక్ చేస్తాయి. ఆ ఫోన్ ఇప్పుడు మోర్గ్‌లో ఎవిడెన్స్ లాకర్‌లో ఉంటుంది.

టీ.జే.ని జైలు నుండి కాపాడడానికి, క్లోయ్ ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేస్తుంది. ఆమె తన క్రిమినాలజీ జ్ఞానాన్ని ఉపయోగించి, ప్రొపోఫోల్ ఇంజెక్ట్ చేసుకుని తనని తానే చంపుకుననేటట్లు చేసుకుంటుంది. నిజానికి ఈ ఇంజెక్షన్, హార్ట్ బీట్ ను తాత్కాలికంగా ఆపేస్తుంది. ఈ కారణంగా ఆమె శవంగా కనిపించి, మోర్గ్‌కు తీసుకెళ్లబడుతుంది. ఆమె ప్లాన్ ప్రకారం, మోర్గ్‌లో రాస్ ఫోన్‌ను దొంగిలించి, ఎవిడెన్స్‌ను నాశనం చేయాలి. అయితే ఈ ప్లాన్ ఊహించని రీతిలో ఫెయిల్ అవుతుంది. అక్కడ మోర్గ్‌ను చూసుకునే టామ్ ఒక సైకోపాథ్. అతను మృతదేహాల నుండి అవయవాలను దొంగిలించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతుంటాడు.

క్లోయ్ ఇంకా బతికే ఉందని టామ్ తెలుసుకుంటాడు. అంతేగాక ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. దీంతో మోర్గ్‌లో ఒక భయంకరమైన క్యాట్-అండ్-మౌస్ గేమ్ ప్రారంభమవుతుంది. క్లోయ్ శరీరం ఇంకా డ్రగ్ ప్రభావంలో ఉన్నప్పటికీ, తన క్రిమినాలజీ తెలివిని ఉపయోగించి టామ్‌తో పోరాడుతుంది. మోర్గ్‌లోని సన్నివేశాలు భయంకరంగా మారుతాయి. మృతదేహాల మధ్య క్లోయ్ దాక్కోవడం, టామ్ మృతదేహాల అవయవాలను తీయడం వంటివి జరుగుతాయి. క్లోయ్, టామ్ నేరాల గురించి కొన్ని ఆధారాలను కనిపెడుతుంది. అతను ఎన్నో హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అని తెలుస్తుంది. ఈ సమయంలో, టీ.జే. కూడా తన సోదరిని కాపాడడానికి మోర్గ్‌కు చేరుకుంటాడు. కానీ టామ్‌తో ఎదురయ్యే ప్రమాదం వారిద్దరినీ ఆపదలోకి నెట్టివేస్తుంది. చివరికి క్లోయ్, టీ.జే. అక్కడి నుంచి బయట పడతారా ? టామ్ నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయి ? క్లోయ్, టీ.జే. ఆర్థిక సమస్యలు తీరుతాయా ? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్-థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కాకులను చంపి తినే పిల్ల రాక్షసి… వచ్చే పౌర్ణమి కల్లా పోతారు అందరూ పోతారు

Related News

HHVM OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు… ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : శవంపై కోరిక… ఏకంగా బాయ్ ఫ్రెండ్ ముందే దాంతో ఆ పని… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమా మావా

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

×