OTT Movie : హారర్ సినమాలను కొత్త తరహాలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ జానర్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలను కూడా ప్రేక్షకులు చూడటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిలో మలేషియా నుంచి వస్తున్న హారర్ సినిమాలు ఓ రేంజ్ లో భయపెడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలేషియన్ మూవీలో, ఒక చిన్న పిల్ల ఆత్మగా మారి బీభత్సం సృష్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ మలేషియన్ హారర్ మూవీ పేరు ‘రోహ్'(Roh). 2019లో విడుదలైన ఈ మూవీకి ఎమిర్ ఎజ్వాన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫరాహ్ అహ్మద్ (మాక్), మియా ఫర్హానా (అలోంగ్), హరిత్ హజిక్ (అంగాహ్), పుత్రి కసేహ్ (అడిక్), నామ్రోన్ (హంటర్), జునైనా ఎం. లోజోంగ్ (టోక్) ప్రధాన పాత్రల్లో నటించారు. మలయ్ జానపద కథలు, ఇస్లామిక్ నమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్ థీమ్ లతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండోనేషియా జోగ్జా-NETPAC ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2019లో ప్రీమియర్ అయింది. ఆగస్టు 2020లో మలేషియా, సింగపూర్‌లో థియేట్రికల్ రిలీజ్ అయినప్పటికీ, COVID-19 లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి.2021 జూన్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కి వచ్చింది. IMDbలో ఈ సినిమాకి 6.0/10 రేటింగ్ ఉంది. ఇది 31వ మలేషియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్ సహా ఆరు అవార్డులు గెలుచుకుంది. 93వ ఆస్కార్‌లలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌కు మలేషియా ఎంట్రీగా సెలెక్ట్ అయింది, కానీ నామినేట్ కాలేదు.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా ఒక మారుమూల పల్లెటూరులో నివసించే మాక్, ఆమె కూతురు అలోంగ్, చిన్న కొడుకు అంగాహ్ చుట్టూ తిరుగుతుంది. మాక్ కు భర్త లేని కారణంగా, తన పిల్లలతో అడవి ప్రాంతంలో భయపడుతూనే జీవిస్తుంటుంది. అయితే అడిక్ అనే ఒక చిన్న అమ్మాయి రాత్రిపూట అడవిలో ఒక సమాధిని తవ్వి, ఒక అతీంద్రీయ ఆచారంలో పాల్గొంటుంది. ఆమె కత్తితో మాక్ కుటీరానికి వస్తుంది. మాక్ ఆ అమ్మాయికి ఆహారం ఇచ్చి, తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామున, అడిక్ ఒక కాకిని ప్రాణాలతో పచ్చిగా తిని, ‘వచ్చే పౌర్ణమి నాటికి మీరందరూ చనిపోతారు’ అని భయంకరమైన జోస్యం చెప్పి, తన గొంతు కోసుకుని చనిపోతుంది. ఈ షాకింగ్ ఘటన కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తుంది.
అడిక్ మరణం తర్వాత, మాక్ ఫ్యామిలీలో వింత సంఘటనలు మొదలవుతాయి. అలోంగ్ నిద్రలో నడుస్తూ అడిక్ సమాధి వద్దకు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక దయ్యం కనిపిస్తుంది. ఈ సంఘటనతో మాక్ మరింత గందరగోళంలో పడుతుంది. ఆ తరువాత ఒక షమన్ , ఈ దెయ్యాలను అడ్డుకోవడానికి సలహాలు ఇస్తుంది. ఇంతలో ఈటెతో వచ్చిన ఒక హంటర్ అడిక్ గురించి మాక్ ని అడుగుతాడు. మాక్ హంటర్‌పై అనుమానం పడుతుంది. అతను తన కుటుంబానికి హాని చేస్తాడని భావిస్తుంది. అలోంగ్ భయంతో, అడవిని విడిచిపెట్టాలని మాక్‌ను ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో హంటర్ అడిక్ కనిపించకపోవడం గమనించి, ఈ కుటుంబాన్ని చెడు శక్తుల గురించి హెచ్చరిస్తాడు.
అడిక్ చెప్పిన జోస్యం ఇప్పుడు పని చేయడం స్టార్ట్ అవుతుంది. మాక్ కుటుంబం వరుస దుర్ఘటనల ద్వారా నాశనమవుతుంది. అలోంగ్ ఒక దెయ్యం ప్రభావంతో, ఒక పదునైన వస్తువుపై తలను బాదుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. మాక్ భయాందోళనలో, అంగాహ్‌తో అడవిని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతుంది. కానీ అంగాహ్ ఆహారం కోసం వెళ్లి కనిపించకుండా పోతాడు. స్టోరీ ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి అంగాహ్ ఏమవుతాడు ? ఇంతకీ అడిక్ ఎవరు ? మాక్ కి ఈ దెయ్యాల వల్ల ప్రమాదం వస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మలేషియన్ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ స్కూల్ లో తప్పు చేస్తే లేపేస్తారు… ‘స్క్విడ్ గేమ్’ లాంటి అదిరిపోయే థ్రిల్లర్