OTT Movie : ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. ఈ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు ఓటీటీలో ఈ థ్రిల్లర్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. భాష తో సంభంధం లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఒక ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. చివరివరకు సస్పెన్స్ తో ఈ మూవీ పిచ్చెక్కిస్తుంది. పోలీసులకు ఆ కిడ్నాపర్ సవాలుగా మారుతాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ (Airtel Xstream) లో
ఈ పంజాబీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్లీజ్ కిల్ మి’ (Please Kill Me). 2021 లో వచ్చిన ఈ పంజాబీ మూవీని క్రైమ్, రొమాన్స్, థ్రిల్లర్ జానర్‌లలో తెరకెక్కించారు.ఈ మూవీకి ప్రేమ్ సింగ్ సిధు దర్శకత్వం వహించారు. ఇందులో జగ్జీత్ సంధు, మేఘా శర్మ, కరణ్‌వీర్ ఖుల్లర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 24 సెప్టెంబర్ 2021న చౌపాల్ OTT ప్లాట్ ఫామ్‌లో విడుదలైంది. ఈ మూవీ ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ (Airtel Xstream) లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించడంతో పాటు, పంజాబీ సినిమా పరిశ్రమలో కొత్త దారులను అన్వేషించే ప్రయత్నంగా కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ దారులు ఏమిటో మూవీ చూస్తే తెలుసుకోవచ్చు.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ ఒక ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి జస్లీన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె కెనడాలో నాలుగు సంవత్సరాలు గడిపిన తర్వాత భారతదేశంలోని పంజాబ్‌లోని ఖరార్ ప్రాంతానికి తిరిగి వస్తుంది. అయితే, ఆమె ఇంటికి చేరుకున్న వెంటనే, ఆమెను ఒక గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఆమెను కనుగొనేందుకు విచారణ ప్రారంభిస్తారు, కానీ కిడ్నాపర్ ప్రతిసారీ పోలీసుల కంటే ఒక అడుగు ముందుంటాడు, దీంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారుతుంది. కిడ్నాపర్ పోలీసులకు చుక్కలు చూపిస్తాడు. స్టోరీ ఉత్కంఠ భరితంగా సాగుతూ, జస్లీన్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? ఆమెకు ఏమవుతుంది? పోలీసులు ఆ కిడ్నాపర్ ను పట్టుకుంటారా? అనే ప్రశ్నల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పంజాబ్‌లో జరుగుతున్న కొన్ని సామాజిక సమస్యలను కూడా పరోక్షంగా చూపించారు. అయితే స్పష్టమైన స్పాయిలర్స్ లేకుండా దీన్ని చూడటమే ఉత్తమం. జగ్జీత్ సంధు ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించాడు, అతని నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చివరికి ఆ ఎన్‌ఆర్‌ఐ అమ్మాయి ఏమౌతోందో అనేది చాలా సస్పెన్స్ గా ఉంటుంది. మీరు కూడా ‘ప్లీజ్ కిల్ మి’ (Please Kill Me) అనే ఈ మూవీని చూడాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చౌపాల్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ (Airtel Xstream) లలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడవచ్చు.