BigTV English
Advertisement

OTT Movie: అబద్దాలతో బురిడీ కొట్టించే ఓ దద్దమ్మ లవ్ స్టోరీ… ఈ రొమాంటిక్ కామెడీ చూస్తే నవ్వులే నవ్వులు

OTT Movie: అబద్దాలతో బురిడీ కొట్టించే ఓ దద్దమ్మ లవ్ స్టోరీ… ఈ రొమాంటిక్ కామెడీ చూస్తే నవ్వులే నవ్వులు

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ సినిమాలంటే చెవి కోసుకుంటూ ఉంటారు. ఇందులో వచ్చే రొమాంటిక్ సీన్స్ కోసం కళ్ళు పెద్దవిచేసుకుని చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ స్టోరీ ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది, ఇక్కడ జిమ్, జోసీ అనే ఇద్దరు వ్యక్తులు, ఒక రాత్రి టార్గెట్ అనే ఒక స్టోర్‌లో లాక్ అయిపోతారు. అక్కడ జరిగే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఈ సినిమాను కామెడీ, రొమాన్స్ కథగా తెరకెక్కించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..


అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video)లో

ఈ రొమాంటిక్ కామిడీ మూవీ పేరు (Career Opportunities). ఈ రొమాంటిక్ మూవీకి బ్రయాన్ గోర్డాన్ దర్శకత్వం వహించారు. దీనిని జాన్ హ్యూస్ నిర్మించారు. ఈ మూవీలో ఫ్రాంక్ వాలీ (జిమ్ డాడ్జ్), జెన్నిఫర్ కాన్నెల్లీ (జోసీ మెక్‌క్లెల్లాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జాన్ హ్యూస్ టీన్ సినిమాల శైలికి సంబంధించినది అయినప్పటికీ, అతని ఇతర చిత్రాలతో పోలిస్తే ఇది కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ముఖ్యంగా జెన్నిఫర్ కాన్నెల్లీ నటన, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జిమ్ డాడ్జ్ అనే 21 ఏళ్ల యువకుడు ఒక చిన్న పట్టణంలో నివసిస్తాడు. అతను ఒక పీపుల్ పర్సన్ అని చెప్పుకుంటాడు. కానీ చాలా బాధ్యతారాహిత్యంగా ఉంటాడు. ఎప్పుడూ ఊహల్లో విహరిస్తూ ఉంటాడు. అతన్ని పట్టణంలో “టౌన్ లయర్” (పుకార్లు పుట్టించేవాడు) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతను తన గురించి ఓవర్ గా గొప్పలు చెబుతూ ఉంటాడు. అతను ఉద్యోగాలు చేయడంలో నిలకడ లేకపోవడంతో, అతని తండ్రి అతన్ని ఇంటి నుండి బయటకు పంపాలని నిర్ణయించుకుంటాడు. చివరికి, జిమ్ ఒక టార్గెట్ స్టోర్‌లో రాత్రి పనిచేసే జనిటర్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. మరోవైపు, జోసీ అనే అమ్మాయి ఆ పట్టణంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త కుమార్తె. ఆమె తన జీవితంలో సంతోషంగా లేకపోవడంతో ఇంటి నుండి పారిపోవాలని అనుకుంటుంది. ఒక రోజు ఆమె టార్గెట్ స్టోర్‌లో దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తుంది. తద్వారా అరెస్ట్ అయి తన తండ్రిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. అయితే ఆమె ఆ స్టోర్ లో నిద్రపోవడంతో, స్టోర్ లాక్ అయిన తర్వాత అక్కడే చిక్కుకుంటుంది.

అదే రోజు జిమ్ తన మొదటి రాత్రి ఉద్యోగంలో స్టోర్‌ని ఒంటరిగా ఆనందిస్తూ, అక్కడి వస్తువులతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను జోసీని చూస్తాడు, వారిద్దరూ ఒకరినొకరు గుర్తిస్తారు. ఇదివరకే వారు హైస్కూల్‌లో చదువుకొని ఉంటారు. అయితే ఇప్పుడు వారి జీవితాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. జోసీ ధనవంతురాలు కాగా, జిమ్ సాధారణ కుటుంబం నుండి వచ్చి ఉంటాడు. వాళ్ళు స్టోర్‌లో సమయం గడుపుతూ, రోలర్ స్కేటింగ్ చేస్తూ, ఆహారం తింటూ, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఈ సమయంలో వారి మధ్య ఒక భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. జోసీ, జిమ్‌ని తనతో కలిసి పట్టణం విడిచి లాస్ ఏంజిల్స్‌కి వెళ్లాలని కోరుతుంది. వారు ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభిస్తారు. అయితే వారి సంతోషం ఎక్కువ సేపు నిలవదు. ఇద్దరు దొంగలు అప్పుడే దోపిడీ కోసం స్టోర్‌లోకి చొరబడతారు. జిమ్, జోసీలను బంధిచి దొంగతనం చేస్తుంటారు. చివరికి ఆ దొంగల నుంచి వీళ్ళు తప్పించుకుంటారా ? కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారా ? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×