Poovu movie OTT : మలయాళ సినిమాలు ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా, మనసుకు హత్తుకునే విధంగా, నేచురల్ గా ఉంటాయి. అందుకే మాలీవుడ్ సినిమాల పట్ల చాలామంది మక్కువ చూపుతారు. ఇక ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటి మలయాళం మూవీనే. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తో సత్తా చాటిన ఈ మూవీ, ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ ఏడాది జనవరి మొదటి వారంలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయిన ఒకే ఒక్క మూవీ ‘పూవు’. ‘అప్పురం’ అనే మరో మూవీ కూడా వచ్చిందనుకోండి. మలయాళ చిత్రం ‘పూవు’ మనోరమ మ్యాక్స్ ఓటీటీలో నేరుగా విడుదలైంది. KPAC లీల, కేవీ మంజులన్ ప్రధాన పాత్రల్లో నటించారు. JioHotstarలో అందుబాటులో ఉన్న విజయరాఘవన్ ‘పూక్కాలమ్’లో పాత్రతో KPAC లీల పాపులర్ అయ్యింది. ఆమె ఇటీవల ‘ఎకో’ సినిమాలోని మాలతి చేదతి అనే పాత్రకు వాయిస్ ఓవర్ అందించింది. ‘పూవు’లో మీనాక్షి అనూప్, శాంతిరావు, శృతి విపిన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడవచ్చు. నిజానికి థియేటర్లలో విడుదల కానప్పటికీ, ఈ చిత్రం చిత్రం పాజిటివ్ రివ్యూలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. జాన్సన్ వి దేవస్సీ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. నినోయ్ వర్గీస్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు.
Read Also : 3 రూపాయల కోసం మతిపోగొట్టే పనులు… మనసుకు హత్తుకునే అచ్చ తెలుగు విలేజ్ డ్రామా
ఈ చిత్రంలోని కథానాయకుడు జీవన్, తన లైఫ్ పై అత్యధిక ప్రభావాన్ని చూపిన నలుగురు మహిళలతో ప్రయాణిస్తాడు. అతని తల్లి, భార్య, కుమార్తె, ఫస్ట్ లవ్ ఈ లిస్ట్ లో ఉంటారు. మరి ఈ నలుగురు ఒక మధ్య వయస్కుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు అన్నది స్టోరీ. దర్శకుడు అనిష్ బాబు అబ్బాస్ ఈ చిత్రంతో ప్రేక్షకులను ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ కి తీసుకెళ్తాడు.
‘పూవు’ సినిమా 2025లో సిడ్నీలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, 2024లో ఈజిప్ట్‌లో జరిగిన హుర్ఘడా యూత్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం అయ్యింది. అలాగే 2023లో జర్మనీలో జరిగిన మ్యాన్‌హీమ్ ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ట్రావెల్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఫీచర్ అవార్డును కూడా గెలుచుకుంది.
కాగా మనోరమ మ్యాక్స్‌లో ఇటీవల వచ్చిన చిత్రాలలో సర్కీత్, కరం, అతిభీకర కాముకన్ ఉన్నాయి. ఇక రీసెంట్ మలయాళం సినిమాల విషయానికొస్తే… సందీప్ ప్రదీప్ నటించిన స్లో-బర్న్ థ్రిల్లర్ ‘ఎకో’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మమ్ముట్టి నటించిన ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’, నివిన్ పౌలీ వెబ్ సిరీస్ ‘ఫార్మా’, ప్రణవ్ మోహన్‌లాల్ హర్రర్ చిత్రం ‘డైస్ ఇరే’ కూడా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.