UnStoppable With NBK Ram Charan Episode : టాలీవుడ్ మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీ సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీ జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమాను జనాలకు కనెక్ట్ అయ్యేలా చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 సందడి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్, బాలయ్య ఫిక్స్ నెట్టింగా చక్కర్లు కొడుతున్నాయి.
గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ టాక్ షోకు రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ షోకు రామ్ చరణ్ వచ్చారు. ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎపిసోడ్ షూటింగ్‌కి ప్రారంభంకు ముందు రామ్ చరణ్ చేయి పట్టుకుని బాలకృష్ణ సంక్రాంతికి వస్తున్నాం, అన్ని సినిమాలు బాగుండాలి. ఇండస్ట్రీకి సక్సెస్ దక్కాలి, ఇండస్ట్రీ మరింత ముందుకు వెళ్లాలి అదే మా ఆశయం అంటూ రామ్ చరణ్‌ను షో కి బాలయ్య తీసుకు వెళ్లారని తెలుస్తుంది. ఈ షోలో రామ్ చరణ్ ఎన్నో విషయాలను షేర్ చేశారు.. ఈ షో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది..
ఇకపోతే అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో గతంలో ఒకసారి ఫోన్ ద్వారా రామ్ చరణ్ మాట్లాడారు. ఇప్పుడు నేరుగా ఆయన మాట్లాడబోతున్నారు. బాలకృష్ణ ఎన్నో సరదా ముచ్చట్లను రామ్ చరణ్ నుంచి రప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో ఉపాసన కొన్ని నిమిషాలు కనిపించబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇక గేమ్ ఛేంజర్ యూనిట్ సభ్యులు దిల్ రాజు, శంకర్‌లు సైతం ఈ ఎపిసోడ్‌లో భాగస్వామ్యం అవుతారేమో చూడాలి.
ఇప్పుడు డార్లింగ్ వంతు… ఒక షోలో చరణ్‌తో ఆట ఆడుకున్నాడు మూవీ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ప్రభాస్ గురించి కొన్ని విషయాలను రీవిల్ చేశారు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ఆట ఆడుకున్నాడు. సరదా ముచ్చట్లను రామ్ చరణ్ నుంచి రప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో ఉపాసన కొన్ని నిమిషాలు కనిపించబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇక గేమ్ ఛేంజర్ యూనిట్ సభ్యులు దిల్ రాజు, శంకర్‌లు కూడా పాల్గొనే అవకాశం ఉంది.. మొత్తానికి వచ్చే వారంలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్పెషల్ ఎపిసోడ్ కోసం మెగా నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.