BigTV English

Rashmika Mandanna: తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత ఓపెన్ అయ్యిపోయాడుగా

Rashmika Mandanna: తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత ఓపెన్ అయ్యిపోయాడుగా

Rashmika Mandanna: ఎన్నాళ్లు దాచిన నిజం ఎప్పటికీ దాగదు. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో ఫాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ కలిసి కనిపించారు అంటే వారిద్దరి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉందని ఇట్టే పసికట్టేస్తారు. ఇక ఇద్దరు కలిసి వెకేషన్స్, టూర్స్, ఎయిర్ పోర్ట్స్, ఈవెంట్స్ అని కలిసి తిరుగుతూ కనిపిస్తే వారిద్దరికీ త్వరలోనే పెళ్లి కాబోతుందని చెప్పుకొచ్చేస్తారు.  ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమే అయినా కూడా సదరు హీరో హీరోయిన్స్ ప్రేమించుకుంటున్నారు అని తెలిసినప్పుడు ప్రేక్షకుల్లో వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.


ఇండస్ట్రీలో కొన్ని జంటలను చూసి వారు పెళ్లి చేసుకోవాలని ఫాన్స్ కోరుకుంటూ ఉంటారు. అలాంటి జంటల్లో విజయ్ దేవరకొండ- రష్మిక ఒకరు. ఛలో సినిమాతో కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు నాట అడుగు పెట్టింది రష్మిక. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది రెండో సినిమా గీతగోవిందం తో స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది.

Prabhas: అవి అవసరమా డార్లింగ్స్.. ప్రభాస్ వీడియో వైరల్


ఇక గీతగోవిందం సినిమాలో తనతో నటించిన విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్దరూ తమ ఇద్దరం మంచి స్నేహితులు అని చెప్పుకొస్తున్న ఫాన్స్ మాత్రం వారిద్దరి వెకేషన్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్  అన్నిచోట్ల కలిసి కనిపించడంతో ఎప్పటికైనా ఈ జంట పెళ్లి చేసుకుంటుందని చాలా గట్టిగా నమ్ముతూ వస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో వీరి ప్రేమ వ్యవహారం ఈ జంట అధికారికంగానే చెప్పుకొస్తున్నారు. డైరెక్ట్ గా పేర్లు చెప్పకపోయినా హింట్లు ఇస్తూనే ఉన్నారు. ప్రేమ పెళ్లి గురించి విజయ్ దగ్గర అడిగినప్పుడల్లా   త్వరలోనే చేసుకుంటాను ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక రష్మిక అయితే ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడిన మీ అందరికీ తెలిసిందేగా అంటూ సిగ్గు పడడం మొదలు పెట్టింది.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ముందు భారీ టార్గెట్… హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా ?

అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని తెలుస్తుంది. వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా తమ పెళ్లి ప్రకటన చేయనున్నారట. ఇక ఇప్పుడు వారిద్దరూ కాకుండా ఒక నిర్మాత రష్మిక పెళ్లి గురించి హింట్ ఇచ్చేశాడు. తాజాగా నిర్మాత సూర్య దేవర నాగవంశీ.. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ, నాగవంశీ, తమన్  ముగ్గురు ఈ షోలో సందడి చేశారు.

ఇక అందులో భాగంగా బాలయ్య నాకు రష్మిక అంటే క్రష్.. ఆమెకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని నాగవంశీని అడగగా.. అతను వెంటనే తడుముకోకుండా.. “తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సార్.. కానీ, ఆ హీరో ఎవరు ఏంటి అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాట వినగానే మీకు చెప్పకపోయినా ఆ హీరో ఎవరో మాకు తెలుసు అంటూ నెటిజన్స్ విజయ్ దేవరకొండ పేరును చెప్పుకొచ్చేస్తున్నారు.

ఈ ఏడాది విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు ఇవే..

నాగవంశీకి కూడా విజయ్ అని తెలుసు కానీ ఎక్కడ చెప్తే తెలిసిపోతుందో అని ఇలా కవర్ చేసి ఉంటాడు అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ జంట మాత్రం వచ్చేయేడాది పెళ్లి చేసుకోవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ ఏడాది పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె అన్ని భాషల్లో ఒక్కొక్క సినిమా చేస్తూ మరింత బిజీగా మారింది. ఇంకోపక్క విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ వీడి 12 సినిమాలో నటిస్తున్నాడు. మరి వీరిద్దరి పెళ్లి కబురు వచ్చే ఏడాది వినిపిస్తుందో లేదో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×