Chamala Kiran Kumar on KTR: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2025 లోనైనా కేటీఆర్‌కు జ్ఞానోదయం కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. 3డీ అనే పేరుతో కాంగ్రెస్ పాలనపై వ్యంగంగా ట్వీట్ చేసిన కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.
గడిచిన పదేళ్లలో కేసీఆర్, కేటీఆర్ చేసిన మోసం పనులు ప్రజలకు తెలియదా..? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఒక్క సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఎలాంటి మోసం జరగలేదని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణను మీరేం అభివృద్ధి చేశారని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిని మోసమే అంటారని కేటీఆర్ ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. చీకటి జీవోలతో రూ.7లక్షల కోట్ల అప్పు చేశారని.. ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసిన వ్యవస్థ కల్వకుంట్ల కుటుంబానిది అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోకనీసం పది రోజులు కూడా సెలవు తీసుకొని నేత.. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని.. ఇది తమ ప్రభుత్వానికి దక్కిన ఘనత అని తన అభిప్రాయాన్ని వ్యక్తం అన్నారు. 3డీ అనేది బీఆర్ఎస్ కే వంద శాతం వర్తిసుందని.. కేటీఆర్ మతిస్థిమితం లేని ట్వీట్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
Also Read: NIT Warangal recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. MISS అవ్వకండి..!
2024వ సంవత్సంర తన జీవితంలో గొప్ప సంవత్సరమని.. ఈ ఏడాది తనకు రాజకీయంగా మంచి అవకాశమచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాద భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనపై చూపించిన ప్రేమను మరవలేనని అన్నారు. ప్రజల కోసం.. అభివృద్ధి కోసం పని చేయడం పైనే తన దృష్టిని కేంద్రీకరించానని సామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.