E-Paper
Advertisement

డిజిటల్ మార్కెట్లో సరికొత్త రికార్డు.. ‘జై హనుమాన్’ ఓటీటీ హక్కులకు భారీ డీల్!

డిజిటల్ మార్కెట్లో సరికొత్త రికార్డు.. ‘జై హనుమాన్’ ఓటీటీ హక్కులకు భారీ డీల్!
Advertisement

Jai hanuman OTT Deal:థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని చిత్రాలకు విడుదలైన తర్వాత ఓటీటీ డీల్ కుదిరితే.. మరికొన్ని చిత్రాలు విడుదలకు ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంటూ ఉంటాయి. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం అనౌన్స్మెంట్ వచ్చిన కొత్తలోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు జై హనుమాన్(Jai hanuman) సినిమా కూడా అదే రేంజిలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అప్పుడే ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

భారీ ఓటీటీ డీల్ కుదుర్చుకున్న జై హనుమాన్..

ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ (Teja sajja) ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం హనుమాన్. ఈ సినిమాకి కొనసాగింపుగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మరో చిత్రం జై హనుమాన్. ఇందులో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తుండగా..మరికొంతమంది ఈ చిత్రంలో భాగమయ్యారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై ఎప్పటికప్పుడు అంచనాలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అంచనాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. అలా హనుమాన్ సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 22న చారిత్రక పట్టణమైన హంపిలో పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభమైంది. 2026 ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.

ఏకంగా 8 రెట్లు భారీ ధర..

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం జి ఫైవ్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా డిజిటల్ ఓటిటి హక్కులు రూ.16 కోట్లకు పైగా అమ్ముడుపోగా.. జై హనుమాన్ సినిమా మాత్రం ఊహించని విధంగా ఏకంగా ఎనిమిది రేట్లు భారీ ధర పలకడం గమనార్హం. జై హనుమాన్ సినిమా ఓటీపీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఏకంగా రూ.120 కోట్లకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ సినిమాకి ఈ రేంజ్ లో ఓటీటీ డీల్ కుదరడం నిజంగా ఆశ్చర్యకరం అంటూ ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

also read: నాకే ఎందుకిలా.. లవ్ బ్రేకప్ పై కామాక్షి రియాక్షన్!

హైయెస్ట్ ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్న చిత్రాలు..

Advertisement

ఇదిలా ఉండగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా 375 కోట్లకు దక్కించుకుంది. ది రాజా సాబ్ సినిమా హక్కులు కూడా రూ.325 కోట్లకు అమ్ముడుపోయాయి. పుష్ప: ది రూల్ సినిమా ఓటీటీ హక్కుల కోసం రూ.285 కోట్ల వరకు నెట్ ఫ్లిక్స్ వెచ్చించి మరీ హక్కులు సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే నెట్ ఫ్లిక్స్ జై హనుమాన్ కోసం ఏకంగా రూ.120 కోట్లు కేటాయించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి జై హనుమాన్ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

అమ్మాయి కోసం ఇలా కూడా చేస్తారా ? చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు భయ్యా

అమ్మాయి కోసం రచ్చరచ్చ… అసలు టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్… ఓటీటీలోకి మహేష్ బాబు అన్న కొడుకు సినిమా

మనుషుల్ని పీక్కుతినే జాంబీకి అమ్మాయిపై ప్రేమ… ఇలాంటి రొమాంటిక్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

చచ్చి బతికి పగ తీర్చుకునే జడ్జి… 10 ఏళ్ల టైమ్ ట్రావెల్‌తో అదిరిపోయే కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులో

17 ఏళ్లుగా కూతురి కోసం వేట… రియల్ స్టోరీతో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

పక్కింటి అబ్బాయితో 15 రోజులు… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే

హైవే యాక్సిడెంట్ చూస్తే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ… ఆగితే అస్సలు వదలని దెయ్యం

Big Stories

Advertisement
×