E-Paper
Advertisement

నాకే ఎందుకిలా.. లవ్ బ్రేకప్ పై కామాక్షి రియాక్షన్!

నాకే ఎందుకిలా.. లవ్ బ్రేకప్ పై కామాక్షి రియాక్షన్!
Advertisement

Kissik Talks: తూర్పుగోదావరి జిల్లా ఏలూరులో పుట్టిన కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) అక్కడి నుండి ఏకంగా చైనాకు వెళ్లి అక్కడ ఎంబిబిఎస్ పూర్తి చేసింది. అపోలోలో కొంతకాలం డాక్టర్ గా పని చేసిన ఈమె.. నటనపై మక్కువ పెంచుకొని తొలిసారి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ గెలుచుకున్న ఈమె.. మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రియురాలు సినిమాతో వెండితెరపై ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ముఖ్యంగా సత్యం రాజేష్ (Sathyam Rajesh) ప్రధాన పాత్రలో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈమె.. పొలిమేర 2 చిత్రంతో సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘పొలిమేర 3’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కామాక్షి.. మరొకవైపు సూపర్ నాచురల్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అగధ సినిమాలో లీడ్రోల్ పోషించి హీరోయిన్గా అందరి దృష్టిని ఆకర్షించింది.

తొలిసారి బ్రేకప్ పై స్పందించిన కామాక్షి..

డీ గ్లామరస్ పాత్ర పోషించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగానే వర్ష (Jabardasth Varsha) హోస్టుగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న కామాక్షి ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే తన బ్రేకప్ విషయంపై కూడా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

నాది కూడా లవ్ ఫెయిల్యూర్ – కామాక్షి

Advertisement

ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్నప్పుడు నచ్చకపోతే నో చెప్పడం చాలా సులభం.. కానీ నో అనే పదాన్ని తీసుకునే ఇంకో వ్యక్తి ఫీలింగ్ చాలా కష్టంగా ఉంటుంది. దాని నుంచి వాళ్లు బయటకు రావాలంటే ఎలా? అని వర్షా ప్రశ్నించగా.. “నేను కూడా నా లైఫ్ లో నో (లవ్ ఫెయిల్యూర్)తీసుకున్నాను. ప్రతిసారి నేను అదే అనుకున్నాను.. నాకే ఎందుకు ఇలా అవుతోంది అని.. నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఆ తర్వాతే నాకు జీవితం పైన ఒక క్లారిటీ వచ్చింది. ఆ బాధను నువ్వు ఎంతైతే అనుభవిస్తావో.. ఆ బాధ లోపల మరింత పెరిగిపోతుంది” అంటూ లవ్ ఫెయిల్యూర్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది కామాక్షి.

also read: రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ పై కామాక్షి హాట్ కామెంట్స్!

Advertisement

కష్టానికి తగిన ప్రతిఫలం..

ఏది ఏమైనా ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ పుట్టడం ఎంత సహజమో ఫెయిల్యూర్ కూడా అంతే సహజం. అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి మనల్ని మనం ఎలా రికవరీ చేసుకున్నాము అనేదే ముఖ్యం. అలా లవ్ లో ఫెయిల్ అయ్యామని బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేం. ఇక నాడు ఎదురైన వైఫల్యాలే తనను నేడు ఈ స్థాయికి తీసుకొచ్చాయని కామాక్షి ధీమా వ్యక్తం చేసింది. మొత్తానికైతే ఇన్నేళ్ల కష్టానికి ఇప్పుడు ఒక స్టార్ స్టేటస్ లభించింది అని చెప్పవచ్చు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×