E-Paper
Advertisement

అమ్మాయి కోసం ఇలా కూడా చేస్తారా ? చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు భయ్యా

అమ్మాయి కోసం ఇలా కూడా చేస్తారా ? చివర్లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు భయ్యా
Advertisement

Romantic Movie on OTT: ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చని చాలామంది అంటారు. కానీ అదే ప్రేమ కోసం దేశాల సరిహద్దులు దాటి, ప్రాణాలను సైతం పణంగా పెట్టే యువకుడు ఉంటే ? అలాంటి గాఢమైన ప్రేమకథే ‘షిద్దత్’ (Shiddat). ‘షిద్దత్’ అంటే ప్రేమలో ఉండే తీవ్రత, గాఢత అని అర్థం. ఈ సినిమా కూడా ఆ పదానికి తగ్గట్టుగానే సాగుతుంది. ఒకవైపు తన ప్రేమను దక్కించుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడే జగ్గీ… మరోవైపు ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా రియాలిటీగా చూసే కార్తీక. వీరిద్దరి ప్రయాణంలో గౌతమ్, ఇరాల కథ కూడా కలుస్తుంది. మరి జగ్గీ ప్రేమ గెలిచిందా? తన ప్రేయసిని కలుసుకున్నాడా? లేక ఈ ప్రేమకథ విషాదంగా ముగిసిందా? అనేది కథలో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ గౌతమ్, ఇరాల పెళ్లితో మొదలవుతుంది. వారి పెళ్లిలో గౌతమ్ చెప్పే ప్రేమ మాటలు జగ్గీని బాగా ప్రభావితం చేస్తాయి. నిజమైన ప్రేమ అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని భావించే అతను, ఓ స్పోర్ట్స్ క్యాంప్‌లో కార్తీకను కలుస్తాడు. మొదట ఇద్దరి మధ్య పెద్దగా సాన్నిహిత్యం ఉండదు. కానీ జగ్గీ తన మనసులోని ప్రేమను దాచుకోకుండా ఆమె వెంటపడుతుంటాడు. అతని నిజాయితీ, మంచితనం చూసిన కార్తీక కూడా మెల్లగా అతనికి దగ్గరవుతుంది.

Advertisement

కానీ కార్తీక జీవితంలో మరో సమస్య ఉంటుంది. ఆమెకు లండన్‌ లో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. జగ్గీతో గడిపిన రోజుల్ని ఒక మధురమైన జ్ఞాపకంగా భావించి, ఆమె లండన్ వెళ్లిపోతుంది. కానీ జగ్గీ మాత్రం ఆమెను మర్చిపోలేడు. కార్తీక కూడా తనను ప్రేమిస్తోందని నమ్మి, ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. వీసా దొరకకపోవడంతో అక్రమ మార్గంలో యూరప్ చేరుకుని లండన్ వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఫ్రాన్స్ బోర్డర్ వద్ద పోలీసులకు చిక్కడంతో అతని ప్రయాణం ఆగిపోయినట్టే కనిపిస్తుంది.

అక్కడే ఇమిగ్రేషన్ అధికారి గౌతమ్ పరిచయం అవుతాడు. జగ్గీ ప్రేమకథ విన్న గౌతమ్ మొదట అతన్ని పిచ్చివాడిగా భావిస్తాడు. కానీ అతని ప్రేమలోని నిజాయితీ, తీవ్రత చూసిన తర్వాత గౌతమ్ మనసు మారుతుంది. ఇదే సమయంలో గౌతమ్, ఇరాల వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తుతుంటాయి. జగ్గీ ప్రేమను దగ్గరగా చూసిన గౌతమ్ తన జీవితంలో చేసిన తప్పులను గుర్తిస్తాడు. చివరికి గౌతమ్ సహాయంతో జగ్గీ లండన్ చేరుకుంటాడు. కార్తీక పెళ్లి జరుగుతున్న చోటుకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కార్తీకకు కూడా జగ్గీ తన కోసం ఇంత దూరం వచ్చాడని తెలుస్తుంది. మరి జగ్గీ ఆమె దగ్గరకు చేరుకున్నాడా ? హీరోయిన్ పెళ్లి ఆగిపోయిందా ? కన్నీళ్ళు పెట్టించే ఆ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ?

Advertisement

‘షిద్దత్’ ప్రస్తుతం Jio Hotstarలో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అధికారికంగా తెలుగు డబ్బింగ్ లేదా తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో లేవు. కావాలంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. 2021లో వచ్చిన ఈ హిందీ రొమాంటిక్ డ్రామాలో సన్నీ కౌశల్, రాధికా మదన్ జంటగా నటించారు. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే కథలు, ముఖ్యంగా ఎమోషనల్ లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్, విషాదాంత ప్రేమకథల కోసం ఓటీటీలో వెతికే వాళ్ళకు ‘షిద్దత్’ బెస్ట్ ఆప్షన్.

Read Also: 17 ఏళ్లుగా కూతురి కోసం వేట… రియల్ స్టోరీతో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Tags

Related News

ప్రేమ కోసం పెట్టిన కండిషన్… ఆటేరాని వాడు ఫుట్ బాల్ గ్రౌండ్ లోకి దిగితే… ఈ స్పోర్ట్స్ డ్రామా తెలుగులోనే

డిజిటల్ మార్కెట్లో సరికొత్త రికార్డు.. ‘జై హనుమాన్’ ఓటీటీ హక్కులకు భారీ డీల్!

అమ్మాయి కోసం రచ్చరచ్చ… అసలు టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్… ఓటీటీలోకి మహేష్ బాబు అన్న కొడుకు సినిమా

మనుషుల్ని పీక్కుతినే జాంబీకి అమ్మాయిపై ప్రేమ… ఇలాంటి రొమాంటిక్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

చచ్చి బతికి పగ తీర్చుకునే జడ్జి… 10 ఏళ్ల టైమ్ ట్రావెల్‌తో అదిరిపోయే కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులో

17 ఏళ్లుగా కూతురి కోసం వేట… రియల్ స్టోరీతో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

పక్కింటి అబ్బాయితో 15 రోజులు… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే

Big Stories

Advertisement
×