OTT Movie : థియేటర్లలో లవ్ కంటెంట్ తో ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. ఈ కంటెంట్ తో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తుంటాయి కూడా. అయితే ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియని టీనేజ్లో లవ్ లో పడితే ఎలా ఉంటుందనేది, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ పేరు ‘ప్రేమించొద్దు‘ (Preminchoddu). 2024లో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాను శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై శిరిన్ శ్రీరామ్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 జూన్ 2న విడుదల చేసి, తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో జూన్ 7న విడుదల చేశారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
లాలస పాలిటెక్నిక్ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. దీని పక్కనే ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ లో కమల్ చదువుతూ ఉంటాడు. పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థుల్ని, ఇంజనీరింగ్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కమల్ అడ్రస్ తెలుసుకోవాల్సిందిగా బిందు అనే అమ్మాయి లాలసకి చెప్తుంది. కమల్ ని ఫాలో అవుతూ ఉండగా, అది గమనించిన కమల్ ఆమెతో మాటలు కలుపుతాడు. ర్యాగింగ్ లో భాగంగా వచ్చానని చెప్పడంతో, కమల్ తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పమని పంపుతాడు. అలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత లాలస పార్ట్ టైం జాబ్ కోసం సారస్ అనే వ్యక్తిని సంప్రదిస్తుంది. అతడు ఆమెను పార్ట్ టైం జాబ్ లో పెట్టుకుంటాడు. ఇది గమనించిన కమల్ తనని ఫాలో అవుతాడు. తనమీద అనుమానంతో ఫాలో అవుతున్నాడని కమల్ ని దూరం పెడుతుంది లాలస.
ఈ క్రమంలో సారస్ కి కూడా దగ్గరవుతుంది లాలస. ఇద్దరి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుంది లాలస. కొన్ని రోజులకి ఈ విషయం ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్ కి తెలిసిపోతుంది. ఇద్దరూ కలిసి లాలస ను ఒక చెరువు గట్టు దగ్గరికి రమ్మని చెబుతారు. అక్కడ కూడా ఒకరికి తెలియకుండా ఒకరిని కలుద్దాం అనుకునని, అలానే కాలవడాని ట్రై చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఆమెపై దాడి చేస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లాలసను అక్కడ ఉన్న కొంతమంది హాస్పిటల్ లో చేర్పిస్తారు. చివరికి ఈ ట్రయాంగిల్ స్టోరీ ముగింపు ఎంత వరకు వస్తుంది? అనే విషయం తెలియాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ప్రేమించొద్దు’ (Preminchoddu) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.