Oscars 2025: సినిమాలకు వరల్డ్ కప్ లాంటిది ఆస్కార్ అవార్డ్స్ .. ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సినీ నటులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు పొందాలని ఎన్నో కల కంటారు. గ తేడాది ఆస్కార్ నామినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ దక్కింది. ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకొని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా సినిమాలు పోటీలో ఉన్నా ఒక దక్షిణాది చిత్రం అస్కార్ గెలిచి మన దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఇక ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ జరిగాయి. ఈ ఏడాది కూడా సౌత్ నుంచి రెండు సినిమాలు నామినేషన్స్ లో ఉండడం విశేషం. అయితే ఇప్పుడు ఆస్కార్ అవార్డుల వేడుక ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనే వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇండియాలో ఆస్కార్ నామినేషన్స్ ను ఎక్కడ ఎప్పుడు చూడవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్కార్ లిస్ట్ లో సౌత్ సినిమాలు..
ఇక ఇప్పుడు 97వ ఆస్కార్ బరిలోను సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. అయితే వాటిల్లో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ కంగువ ఆస్కార్ బరిలో నిలిచింది. అదేవిదంగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారం నటించిన ది గోట్ లైఫ్ అనే మూవీ కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ సంతోష్ , స్వాతంత్ర్య వీర సావర్కర్ ,’ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ వంటి సినిమాలు లిస్ట్ ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయినా సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. అయితే తాజాగా నేడు నామినేషన్లను అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.
ఇండియాలో నామినేషన్స్ ఎక్కడ చూడొచ్చంటే..?
ఈ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ అయితే వచ్చింది. అందులో సౌత్ మూవీస్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నామినేషన్స్ ని ఎప్పుడు ఫైనల్ చేస్తారని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.. టైం రానే వచ్చింది నేడు ఆస్కార్ ఫైనల్స్ ని అనౌన్స్ చెయ్యనున్నారని తెలుస్తుంది. మన ఇండియాలో ఈ 97వ అకాడమీ అవార్డులకు నామినేషన్లు ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రకటించబడతాయి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, BBC న్యూస్ లైవ్ మరియు హులు లో చూడొచ్చు. ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో మన సౌత్ నుంచి ఒక హిట్ మూవీ, కంగువ లాంటి మూవీలు ఉండటం విశేషం.. పృథ్వీ రాజ్ నటనకు ఫిదా అయిన సౌత్ సినీ అభిమానులు ఆయన సినిమాకే అవార్డు దక్కుతుందని అంటున్నారు. మరి చూడాలి ఎవరికి ఆ అదృష్టం పట్టబోతుందో. ఇక ఫైనల్ నామినేషన్లో విజేతలుగా నిలిచిన చిత్రాలకు మార్చి 2న జరిగే ఆస్కార్ 2025 అవార్డ్స్ వేడుకలో అవార్డ్స్ని ప్రధానం చేయనున్నారు.. మరి ఏ సినిమాకు ఆస్కార్ వరిస్తుందో చూడాలి…