సముద్రం ఎన్నో జీవులకు నెలవుగా ఉంటుంది. లక్షలాది చేప జాతులు జీవిస్తుంటాయి. వీటన్నింటితో పోల్చితే ఓ అరుదైన చేప ఉంటుంది. ఆ చేప చూడ్డానికే కాదు, కనిపించే సందర్భం కూడా ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆ చేప కనిపించిందంటే మహా ప్రళయం ముంచుకొస్తుందని అర్థం. ఇప్పటి వరకు ఆ చేప ఒడ్డుకు చేరిన ప్రతి సందర్భంలోనూ భీకర సుననామీలు వచ్చి వేలాది మంది ప్రజల ప్రాణాలను తీశాయి. నిజానికి ఈ చేపలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. సముద్రం ఉపరితలం నుంచి 656 అడుగుల నుంచి 3,280 అడుగుల లోతులో నివసిస్తాయి. వాటి శరీరం పొలుసులు లేకుండా ఉంటుంది. చర్మం గ్వానైన్ అని పిలువబడే సన్నని వెండి లాంటి రక్షణ పూతను కలిగి ఉంటుంది. అలాంటి అరుదైన చేప తాజాగా మరోసారి దర్శనం ఇచ్చింది. ఈసారి మెక్సికన్ బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఏ ప్రళయం ముంచుకొస్తుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
విపత్తులకు ముందు కనిపించే అరుదైన డూమ్స్ డే చేప!
ప్రళయానికి సంకేతంగా భావించే ఆ చేప పేరు డూమ్స్ డే. దీనిని సాధారణంగా గాడ్స్ ఫిష్ అని కూడ పిలుస్తుంటారు. తాజాగా ఈ చేపను మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పం సమీపంలో సర్ఫర్లు గుర్తించారు. సుమారు 36 అడుగుల పొడవుతో ఉన్న ఈ చేప వెండి నీలం రంగు శరీరంతో మెరిసిపోతూ కనిపించింది. దాని వెనుక భాగంలో ఉన్న ఎర్రటి రెక్కకు గాయమైంది. సర్ఫర్లు మళ్లీ ఆ చేపను సముద్రంలోకి వదిలారు. ఈ చేపలు బలమైన భూకంపాలు, సునామీల లాంటి ప్రకృతి విపత్తులకు ముందు మాత్రమే కనిపిస్తాయని ఓ స్థానికుడు చెప్పాడు.
డూమ్స్ డే చేపలు కనిపించిన ప్రతిసారి భారీ విపత్తులు
డూమ్స్ డే చేపలు కనిపిస్తే ప్రకృతి విపత్తులు వస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించనప్పటికీ.. ఈ చేపలు కనిపించిన ప్రతిసారి సునామీలు, భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. జపాన్ ను సునామీకి కొన్ని నెలల ముందు 20 డూమ్స్ డే చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. 2011 మార్చిలో సముద్ర గర్భంలో 9.0 తీవ్రతతో కూడిన భూకంపం రావడంతో భీకర సునామీ జపాన్ ను ముంచెత్తింది. ఈ ఘటనలో ఏకంగా 15 వేల మందికి పైగా జనాలు చనిపోయారు. గత ఏడాది కాలిఫోర్నియాలో ఈ చేప కనిపించింది. 7.0 తీవ్రతతో కూడిన భూకంపం ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసింది.
భయంతో వణికిపోతున్న మెక్సికన్లు
ఇక తాజాగా మెక్సికన్ బీచ్ లో డూమ్స్ డే చేపలు కనిపించడంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రకృతి ప్రళయానికి గుర్తుగా భావించే చేప దర్శనం ఇవ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కచ్చితంగా రాబోయే విపత్తు చాలా తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆదేశ ప్రకృతి విపత్తుల విభాగం సైతం ఫోకస్ పెట్టింది. కాలిఫోర్నియాను పసిఫిక్, ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దు అయిన ఈ ప్రాంతంలో భూకంపాలకు అవకాశ ఉన్న నేపథ్యంలో ఈ చేప కనిపించడంపై ఆరా తీస్తున్నారు.
Read Also: లా నీనా వస్తోంది.. ఇండియాపై అలాంటి ప్రభావం, అసలు ఏంటిదీ?