OTT Movie : కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటాయి. మరికొన్ని థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో దూసుకెళ్తాయి. గత ఏడాది మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఒక మూవీ థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఒక ప్రేమ జంట కథ విషాదంతో ముగుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఈ మలయాళం రొమాంటిక్ మూవీ పేరు ‘కల్బ్’ (Qalb). 12 జనవరి 2024 లో రిలీజ్ అయిన ఈ మలయాళ రొమాంటిక్ ట్రాజెడీ మూవీలో రంజిత్ సజీవ్, నేహా నజ్నీన్, సిద్ధిక్ నటించారు. 2024 డిసెంబర్ నుండి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరో ఫారినర్స్ కి గైడ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇతని తండ్రి బీచ్ లో ఒక రెస్టారెంట్ ని నడుపుతుంటాడు. హీరో అతని ఫ్రెండ్స్, బీచ్ కి వచ్చే ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫారిన్ వెళ్లిపోవాలనుకుంటారు. అలా ఒకసారి అమ్మాయిని ఫారిన్ ఇష్టపడతాడు హీరో. అయితే ఆ అమ్మాయికి ఇదివరకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండటం చూసి, చూసి షాక్ అవుతాడు హీరో. ఒక కొత్త ఫ్యామిలీ హీరో ఉండే ఏరియాకి వస్తారు. హీరోయిన్ ఇంట్లో ఉండే మోనా అనే చిలుక తప్పిపోయి ఉంటుంది. దానిని పట్టిస్తే డబ్బులు ఇస్తారని తెలుసుకున్న హీరో ఆ చిలుకను పట్టుకుంటాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోకి డబ్బులు ఇచ్చి ఆ చిలకను తీసుకువెళ్లిపోతుంది. అలా హీరోయిన్ ని చూసిన హీరోకి ప్రేమ మొదలవుతుంది. అలా కొద్ది రోజులకి వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. అయితే హీరోయిన్ తండ్రి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. అతడు ఎన్కౌంటర్ చేసి హీరో ఉండే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యుంటాడు. తండ్రికి తెలియకుండా, హీరోతో వెళ్లిపోవాలనుకుంటుంది హీరోయిన్.
ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ తండ్రి, హీరో ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లో హీరోని బాగా కొట్టి టార్చర్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తండ్రి తో మీరు చెప్పినట్టే చేస్తాను, హీరోని వదిలేయమని వేడుకుంటుంది. తండ్రి మనసు కరగక పోగా, అతన్ని చంపేస్తానని ఇండైరెక్ట్ గానే చెప్తాడు. హీరోని కాపాడటానికి హీరోయిన్ సూసైడ్ చేసుకుంటుంది. తాను చనిపోతే హీరోని హీరోని తండ్రి వదిలేస్తాడు అనుకుంటుంది. హీరోయిన్ చనిపోయిన తరువాత హీరో గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఆ తర్వాత హీరో కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు. చివరికి హీరో తీసుకున్న నిర్ణయం ఏమిటి? హీరోయిన్ తండ్రి, హీరోని వదిలేస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కల్బ్’ (Qalb) అనే ఈ మూవీని చూడాల్సిందే.