OTT Movie : విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలు పోషించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించి, ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా దూసుకుపోయింది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇందులో చివరి వరకు ఈ మూవీ సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రాత్ అకేలీ హై’ (Raat Akeli Hai). 2020 లో వచ్చిన ఈ మూవీకి హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, శ్వేతా త్రిపాఠి, తిగ్మాన్షు ధులియా, శివాని రఘువంశీ, నిశాంత్ దహియా, జ్ఞానేంద్ర త్రిపాఠి, ఇలా అరుణ్, స్వానంద్ కిర్కిరే ప్రధాన పాత్రలు పోషించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఉత్తమ నటుడి అవార్డును పొందగా, ఈ మూవీ ఉత్తమ చిత్రంగా కూడా నిలిచింది. ‘రాత్ అకేలీ హై’ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రిమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జితిన్ ఒక పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఇతడు తల్లితోపాటు ఒక ఫంక్షన్ కి వస్తాడు. తల్లి జితిన్ కి అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. పెళ్లిచూపులు ఏమాత్రం ఇష్టం లేని జితిన్, ఆమెను నామమాత్రంగా చూస్తాడు. ఆమె కూడా ఏమాత్రం ఇష్టం లేనట్టుగానే ప్రవర్తిస్తుంది. ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే జితిన్ కి అతనిపై ఆఫీసర్ నుంచి ఒక కాల్ వస్తుంది. రఘువీర్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తాడు. జితిన్ ఆ ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. రఘువీర్ కి ఇదివరకే పెళ్లి జరిగి ఉంటుంది. మొదటి భార్య చనిపోవడంతో, రాధ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి జరిగిన మొదటి రాత్రి లోగా అతను చనిపోతాడు. అతనికి ఒక కొడుకు, కూతురు కూడా ఉంటారు. ఏమాత్రం బాధ లేకుండా కొడుకు తిరుగుతూ ఉంటాడు. వీళ్ళ దగ్గర రిలేషన్ కి ఏమైనా సంబంధం ఉందా అని ఆరా తీస్తాడు.
అయితే జితిన్ రాధను ఐదు సంవత్సరాల క్రితం చూసినట్టు గుర్తు తెచ్చుకుంటాడు. ఆమెను రైలు నుంచి దూకేటప్పుడు కాపాడి, ఆమె తండ్రికి అప్పజెప్తాడు జితిన్. ఆమెను ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు జితిన్. మా నాన్న వీళ్లకు అమ్మేశాడని చెప్తుంది రాధ. ఆరోజు కాపాడి తండ్రికి అప్పజెప్పిన విషయం తలుచుకొని బాధపడతాడు. అప్పటినుంచి ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఈ కేసులో ఆమెను ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని, అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తాడు. చివరికి రఘువీర్ని చంపింది ఎవరు? రాధకు, ఈ హత్యకు సంబంధం ఉందా ? ఈ హత్య కేసును జితిన్ ఎలా కొలిక్కి తెస్తాడు. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.