BigTV English

Raghu Thatha On OTT: ఓటీటీలో రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ.. 24 గంటల్లో 50 మిలియన్ వ్యూస్

Raghu Thatha On OTT: ఓటీటీలో రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ.. 24 గంటల్లో 50 మిలియన్ వ్యూస్

Actress keerthy Suresh Movie Hits 50 Million Streaming Minutes In 24 Hours: మహానటి కీర్తి సురేష్ ప్రధానపాత్రలో వచ్చిన సినిమా “రఘు తాత”. తమిళంలో ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు.


ఇక కథ విషయానికి వస్తే.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో పొలిటికల్ కామెడీ పీరియాడికల్ స్టోరీ. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్‌లో తీశారు. ఫస్ట్ ఆఫ్ కాస్త బోరింగా అనిపించిన లాస్ట్‌కి మాత్రం మంచి మెసేజ్ ఇచ్చారు సుమన్ సుకుమార్. మొదటి సారైన ఈ సినిమాను చాలా బాగా తీశారు. మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. మద్రాస్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయ్‌‌గా చాలా నాచురల్‌గా సెట్ అయింది. స్టోరీస్ రాయడమంటే తనకు చాలా ఇష్టం. ఇంకా మదర్ టంగ్ ప్రేమికురాలు. పెళ్లి వ్యతిరేకి..

కానీ కాన్సర్ బారిన పడిన తాత.. రఘు తమన్ చివరి కోరిక మేరకు అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకుంటుంది. తాను ఇష్టపడిన ఇంజనీర్ తమిళ్ శల్వన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. నిశ్చితార్ధం తర్వాత శల్వన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుని షాక్ అయిన కీర్తి సురేష్.. పెళ్లిని కాన్సిల్ చేసేందుకు రెడీ అవుతుంది. ఆ ప్లాన్ లో భాగంగా మనసు చంపుకొని హిందీ పరీక్ష రాస్తుంది. కెరీర్లో ఎదిగేందుకు గాను రాసిన ఆ ఎగ్జామ్‌కు, పెళ్లికి సంబంధం ఏంటి? ఆ టెస్టుకోసం కీర్తి సురేష్ ఎలాంటి కష్టాలు పడింది.


Also Read: ఆ పుస్తకం చదివితే చచ్చిపోతారు… హడలెత్తించే హర్రర్ మూవీ..

పరీక్ష రాసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? తనతో పాటు ఎన్నో సార్లు హిందీ ఉద్యమాల్లో పాల్గొని గ్రామస్థులకు స్పూర్తిగా నిలిచిన మనవరాలు.. హిందీ పరీక్ష రాసిందని తెలుసుకున్న రఘు తమన్ పరిస్థితి ఏంటి? అసలు సెల్వన్ గురించి కీర్తి సురేష్ తెలుసుకున్న నిజమేంటి? ఇద్దరు ఒక్కటయ్యారా అనేది సినిమా చూసి ఫీలైతేనే బాగుంటుంది. ఫామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏమి లేవు. కీర్తి సురేష్ అందం, అభినయం, యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో కాస్త లాగ్ సీన్స్ ఎక్కువే ఉన్న లాస్ట్‌కు మాత్రం రఘు తాత ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి ఈ సినిమా చూసేయండి.

రఘుతాత సినిమా 50 మిలియన్ స్ట్రీమింగ్ మార్కును దాటేసింది..

మహానటి కీర్తి సురేష్ నమ్మిన దానికోసం నిలబడే స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది.

ఈ సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మార్కును అధిగమించింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ5లో ఈ మూవీ అందుబాటులో ఉండటంతో విశేష ఆదరణ పొందింది.

Related News

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈ వారం ఓటీటీలోకి ఒక్కో భాష నుంచి ఒక్కో మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్

OTT Movie : ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటుడికి ఛాన్స్… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

Big Stories

×