OTT Movie : ఓటీటీ లో ఇప్పుడు రకరకాల స్టోరీలతో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటిల్లో సైన్స్ ఫిక్షన్ సిరీస్ లు చూడటానికి ఆసక్తిని పెంచుతాయి. ఈ సిరీస్ లలో పెద్దల నుంచి, పిల్లల వరకూ అలరించే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైన్స్ ఫిక్షన్ సిరీస్ లో ఒక పిల్లాడికి అదిరిపోయే సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ తో అతను చేసే విన్యాసాలు కూడా చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ పేరు ‘రైసింగ్ డియాన్’ (Raising Dion). ఈ సిరీస్ డెన్నిస్ లియు రాసిన కామిక్ బుక్ ఆధారంగా రూపొందించబడింది. ఇది 2019 లో మొదటి సీజన్‌తో ప్రారంభమైంది. 2022 లో రెండవ సీజన్ విడుదలైంది. ఈ స్టోరీ నికోల్ రీస్ అనే సింగిల్ మదర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కుమారుడు డియాన్‌కు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కనిపెడుతుంది. ఆ తరువాత స్టోరీ మాత్రం రసవత్తరంగా ఉంటుంది. ఈ అమెరికన్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
నికోల్ రీస్ అనే ఒక మహిళ వితంతువు గా ఉంటుంది. ఆమె భర్త మార్క్ ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తూ, ఒక రహస్యమైన సంఘటనలో మరణిస్తాడు. నికోల్ తన ఏడేళ్ల కుమారుడు డియాన్ ని పెంచుతూ ఉంటుంది. ఒక రోజు, డియాన్‌కు అసాధారణ శక్తులు ఉన్నాయని తెలుస్తుంది. అతను వస్తువులను టెలికినిసిస్‌తో కదిలించగలడు. అదృశ్యమవడంతో పాటు, ఇతర సూపర్ పవర్స్‌ను కూడా ప్రదర్శిస్తాడు. ఇతనికి ఉన్న పవర్స్ చూసి నికోల్ ఆశ్చర్య పోతుంది. నికోల్‌కు ఈ శక్తుల గురించి తెలియడంతో, ఆమె డియాన్‌ను సాధారణ జీవితం గడపడానికి చర్యలు తీసుకుంటుంది. కొడుకుకి ఉన్న ఈ శక్తులను బయటపడకుండా, రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అయితే, డియాన్ కి ఈ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి. వాటిని ఎలా నియంత్రించాలో తెలుసుకోవడానికి, ఆమె మార్క్ స్నేహితుడు పాట్ సహాయం తీసుకుంటుంది.
కథ ముందుకు సాగుతున్న కొద్దీ, డియాన్ శక్తులకు సంబంధించిన ఒక చీకటి రహస్యం బయటపడుతుంది. మార్క్ మరణానికి కారణమైన ఒక శక్తివంతమైన క్రూకెడ్ మ్యాన్ అనే రాక్షస శక్తి, డియాన్‌ను వెంబడిస్తుంది. నికోల్, డియాన్, వారి సన్నిహితులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ డియాన్ శక్తులు వాళ్ళందరికీ రక్షణాత్మకంగా ఉపయోగపడతాయి. ఈ ఇద్దరి మధ్య ఉండే శక్తులు ఒక భయానక వాతావరణాన్ని తీసుకొస్తాయి. చివరికి ఆ రాక్షస శక్తి ని డియాన్ అంతం చేస్తాడా ? అతని తండ్రి మరణం వెనక రహస్యం ఏమిటి ? అతనికి ఈ శక్తులు ఎలా వస్తాయి ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Also Read : ప్రియురాలి ఇంటికే పనోడిగా వెళ్ళే ప్రియుడు .. పొట్ట చెక్కలయ్యే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్