BigTV English

Chiranjeevi: మా బిడ్డ ఇంటికొచ్చేశాడు, కానీ.. మార్క్ శంకర్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: మా బిడ్డ ఇంటికొచ్చేశాడు, కానీ.. మార్క్ శంకర్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తాజాగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సింగపూర్‌లోని స్కూల్‌లో తన చదువును కొనసాగిస్తున్నాడు మార్క్ శంకర్. అందులో అగ్ని ప్రమాదం జరగగా తన చేతికి, కాలికి గాయాలయ్యాయి. దీంతో కొణిదెల కుటుంబం తనను చూడడానికి వెంటనే సింగపూర్ బయల్దేరారు. తండ్రి పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవి, సురేఖ కూడా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నేరుగా తెలుసుకోవడం కోసం సింగపూర్‌కు బయల్దేరారు. ప్రస్తుతం అక్కడే ఉన్న చిరంజీవి.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై అప్డేట్ అందిస్తూ ఒక ట్వీట్‌ను షేర్ చేశారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటో కూడా అప్లోడ్ చేశారు.


అందరికీ ధన్యవాదాలు

‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. కానీ ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మార్క్ శంకర్ మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు’’ అంటూ చిరంజీవి (Chiranjeevi) ఒక్క ట్వీట్‌తో మార్క్ శంకర్ (Mark Shankar) ఆరోగ్యం పూర్తి అప్డేట్ అందించేశారు.


అందుకే చికిత్స

మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదం గురించి తెలియగానే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు.. ఇలా అందరూ తను త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అంతే కాకుండా ఈ విషయం తెలియగానే చాలామంది రాజకీయ ప్రముఖులు సైతం తనకు స్వయంగా ఫోన్లు చేసి ఆరాతీశారని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. అగ్ని ప్రమాదం వల్ల మార్క్ శంకర్ చేతికి, కాళ్లకు గాయాలు అవ్వడంతో పాటు ఆ పొగ వల్ల తను ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని కూడా ఆయనే బయటపెట్టారు. ప్రస్తుతం ఊపిరి తీసుకోవడం సమస్యగా ఉండడం వల్లే తనకు ఇంకా చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. అయితే మార్క్ శంకర్ కోలుకోవాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి చిరంజీవి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Also Read: చిన్నపిల్లాడిపై అలాంటి ట్వీటా.? వీడు మనిషేనా? అరెస్ట్ చేయాల్సిందే.!

అందరికీ క్లారిటీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). అందుకే తన భార్య.. సింగపూర్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. తమ కుమారుడు మార్క్ శంకర్‌ను అక్కడే స్కూల్‌లో జాయిన్ చేసింది. అలా మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం తాజాగా బయటికొచ్చింది. దీంతో వెంటనే ఈ వార్త వైరల్ అయ్యింది. దానివల్ల మార్క్ శంకర్‌కు ఏమైనా ప్రమాదమా.? తన ఆరోగ్యం బాగానే ఉందా అంటూ అభిమానులు ఆందోళన పడడం మొదలుపెట్టారు. అందుకే తన కుమారుడిని చూడడానికి సింగపూర్ వెళ్లే ముందు ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి, మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ ఇచ్చి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×