E-Paper
Advertisement

Gambhir – Pant: గంభీర్ -రిష‌బ్ పంత్ మ‌ధ్య‌ గొడ‌వ‌లు…టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు ?

Gambhir – Pant: గంభీర్ -రిష‌బ్ పంత్ మ‌ధ్య‌ గొడ‌వ‌లు…టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు ?
Advertisement

Gambhir – Pant:  టీమిండియా జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడు.. అప్పటినుంచి టీమిండియా గాడి తప్పింది. తన మాట వినని వాళ్లను టార్గెట్ చేసి గౌతమ్ గంభీర్ కుట్రలు చేస్తున్నాడట. మళ్లీ జాతీయ జట్టులో ఆడకుండా ప్లేయర్లపై పన్నాగం పన్నుతున్నాడట గౌతమ్ గంభీర్. మొన్నటి వరకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పై కుట్రలు పన్నిన గౌతమ్ గంభీర్, ఇప్పుడు రిషబ్ పంత్ లాంటి డేంజర్ ఆటగాడిని టార్గెట్ చేశాడట. రిషబ్ పంత్, గౌతమ్ గంభీర్ మధ్య దాదాపు రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ జట్టులో పంత్ కు అవకాశం రాకుండా గౌతమ్ గంభీర్ కుట్రలు పన్నుతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

గౌతమ్ గంభీర్ – పంత్ మధ్య గొడవలు ?

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే రిషబ్ పంత్ మధ్య గొడవలు జరుగుతున్నాయట. సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య గౌహతి వేదికగా నవంబర్లో రెండవ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సందర్భంగా రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. మెడనొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు గిల్. దీంతో పంత్ జట్టు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆ టెస్టు సందర్భంగా గౌతమ్ గంభీర్ చెప్పిన రూల్స్ పాటించకుండా, తనకు నచ్చినట్లు వ్యవహరించాడట రిషబ్ పంత్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తరహాలోనే తన రూట్లో వెళ్లిపోయాడట పంత్. ఇది కక్ష పెట్టుకున్న గౌతమ్ గంభీర్… పంతుకు చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడట. అటు రిషబ్ పంత్ కూడా ఏమాత్రం తగ్గలేదని సమాచారం. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే క్రమశిక్షణ పేరుతో రిషబ్ పంత్ పై వేటువేయాలని బిసిసిఐ కి చాలాసార్లు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో రిషబ్ పంత్ లాంటి డేంజర్ ఆటగాడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్ట్ చేయలేదని వార్తలు వస్తున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ సెలెక్ట్ అయ్యారు.

గంభీర్ వ‌ల్లే పంత్ కు నో ఛాన్సులు !

న్యూజిలాండ్ తో త్వరలోనే 3 వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ టోర్నమెంటుకు ఈనెల ఏడవ తేదీన టీమిండియా జట్టును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో కూడా రిషబ్ పంత్ ను పక్కకు పెట్టాలని కుట్రలు జరుగుతున్నాయట. దీనంతటికీ కారణం గౌతం గంభీర్ అంటున్నారు. రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ కు అవకాశం రానుందట. ఇలాగే ఇద్దరి మధ్య గ్యాబ్ పెరిగితే, రిషబ్ పంత్ మళ్లీ జాతీయ జట్టులో కనిపించడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×