Rajeev Kanakala Short Film: నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడ సినిమాల్లో ప్రతికథానాయకుడి పాత్రల్లో నటించి మెప్పించిన ప్రస్తుతం పెద్ద సినిమాలు, స్టార్ హీరో చిత్రాల్లో సహాయక నటుడి పాత్రలు చేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద సినిమాలు, స్టార్ హీరోలక విలన్ రోల్స్ చేసిన ఆయన ప్రస్తుతం తండ్రి, బాబాయ్ వంటి పాత్రలతో మెప్పిస్తున్నారు. తెరపై కనిపించేది కాసేపైన తన ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
ఈ క్రమంలో చిన్న, పెద్ద అనే సినిమా అనే తేడా లేకుండ ప్రాధాన్యత ఉంటే ఎలాంటి సినిమాకైనా ఒకే చెబుతున్నారు. ఇటీవల ‘హోమ్ టౌన్’ అనే సరీస్లో నటించిన రాజీవ్ కనకాల.. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ నిర్మించిన ఈ లఘు చిత్రంలో రాజీవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఆయన సరసన ప్రమోదిని మురుగన్ నటించింది. మరో నటి గాయత్రి భార్గవి ముఖ్యపాత్ర పోషించింది. అదే ‘మౌనమో నీభాష‘. సుచేత డ్రీమ్ వర్క్స్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై ఈ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు. వర ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శక–రచయితగా వ్యవహరించారు.
సుమారు 30 నిమిషాల పాటు సాగే ఈ షార్ట్ ఫిల్మ్.. సెప్టెంబర్ 7 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ ప్రమోషన్స్లో దర్శకుడు వర ముళ్లపూడి మాట్లాడుతూ.. మాటల మౌనంలో కలిసినప్పుడు మౌనంలో మనసు మునిగినప్పుడు.. బాధలు మాటలకి అందనప్పుడు మాటలు మరచిన మనసుకు.. మౌనమో భాష.. అలా తెరకెక్కిందే మా ఈ మౌనమే నీభాష చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రం ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్తో నిండిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని పేర్కొన్నారు. అనంతరం నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ‘ఎన్నో భావోద్వేగాలున్న ఈ షార్ట్ ఫిల్మ్‌ని ఎప్పుడెప్పుడు మీరందరూ చూసి.. నన్ను నా నటనని ఆదరిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా‘ అని అన్నారు.