BigTV English

Lal salam OTT : హమ్మయ్యా… రిలీజైన 16 నెలలకు ఓటీటీలోకి వచ్చిసేన రజినీ మూవీ… వివాదం ముగిసిందా..?

Lal salam OTT : హమ్మయ్యా… రిలీజైన 16 నెలలకు ఓటీటీలోకి వచ్చిసేన రజినీ మూవీ… వివాదం ముగిసిందా..?

Lal salam OTT : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. యావరేజ్ టాక్ ని అందుకోవడం తో పాటుగా కలెక్షన్స్ కూడా సో సో గానే వసూల్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతోపాటు ఐఎండీబీలోనూ దారుణమైన రేటింగ్ సొంతం చేసుకుంది.. రజినీకాంత్ సినీ కెరియర్ లో ఈ మూవీనే బ్యాడ్ రివ్యూను సొంతం చేసుకుంది. అయితే ఎప్పుడో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో పూర్తి వివరాలను తెలుసుకుందాం..


లాల్ సలామ్.. 

కోలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన చిత్రం లాల్ సలామ్.. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసింది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే దారుణమైన టాక్ ను అందుకోవడంతో పాటుగా ఫస్ట్ డే ఘోరంగా కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా రజనీ అతిథి పాత్రపై భారీ ఆశలు పెట్టుకున్నా అదీ వర్కౌట్ కాలేదు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఐశ్వర్య ఈ మూవీ ద్వారా తీవ్రంగా నిరాశపరిచింది. టాక్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాను ఓటీటీ లో చూసేందుకు రజినీ అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు..


ఓటీటీ.. 

రజినీ కాంత్ అతిధి పాత్రలో నటించిన మూవీ లాల్ సలామ్.. మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి దారుణంగా డిజాస్టర్ అయింది. అయితే ఇన్నాళ్లకు ఓటీటీలోకి రాబోతుంది. బక్రీద్ సందర్భంగా జూన్ 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో రిలీజైన సుమారు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

Also Read : ఓటీటీలోకి వచ్చేసిన ‘షకీలా’మూవీ.. స్ట్రీమింగ్ఎక్కడంటే..?

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజనీకాంత్ నటించాడు. ఓ ఊళ్లో జరిగిన మత హింసకు క్రికెట్ మ్యాచ్ ద్వారా అతడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అతడే సినిమాకు డైలాగులు కూడా రాశాడు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. విష్ణు విశాల్, విక్రాంత్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. స్టోరీ అంతగా ఆకట్టుకోకపోవడంతో సినిమా దారుణంగా బోల్తా కొట్టేసింది. తమిళ్లో పర్వాలేదు అనిపించినా కూడా తెలుగులో మాత్రం మరి దారుణం.. రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొంది.. రూ.35 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సినిమాకు కేవలం 13 కోట్లు మాత్రమే వసూల్ అయ్యాయి.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.. ఇకపోతే ప్రస్తుతం రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు..

Tags

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×