RCB vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… మ్యాచ్ లన్ని దాదాపు పూర్తయ్యాయి. కేవలం రెండంటే రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకటి క్వాలిఫైయర్ 2 కాగా మరొకటి ఫైనల్. నిన్నటి ఎలిమినేటర్ మ్యాచ్ తో క్వాలిఫైయర్ 2 అర్హత సాధించిన జట్టు ఏది అనేది క్లారిటీ వచ్చేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచి క్వాలిఫైయర్ 2కు రావడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
Also Read: Jonny Bairstow: పాకిస్థాన్ కంటే దారుణంగా ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్.. ఇలా చేస్తున్నారేంట్రా
ముంబై ఇండియన్స్ ఫైనల్ కు వస్తే బెంగళూరు గెలవడం కష్టమే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగింది. రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. అయితే చివర్లో గెలవాల్సిన గుజరాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్… కూడా ఒకే ఒక పరుగు చేశాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతిలోకి వెళ్ళింది ఈ నేపథ్యంలోనే 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ కొట్టింది. క్వాలిఫైయర్ 2 లోకి ఎంటర్ ఇచ్చింది ముంబై ఇండియన్స్.
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో గుజరాత్ జట్టు అత్యంత దారుణంగా విఫలమైంది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది గుజరాత్ టైటాన్స్.
బెంగళూరుకు కొత్త టెన్షన్
గుజరాత్ టైటాన్స్ జట్టు పైన గెలిచిన ముంబై ఇండియన్స్ నేరుగా క్వాలిఫైయర్ 2 కు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో పంజాబ్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ప్రస్తుతం ఉన్న ఫార్మ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మకు తోడుగా.. ఇప్పుడు ఐదు కోట్ల ప్లేయర్ బెయిర్ స్టో బరిలోకి దిగాడు. నిన్న 47 పరువులతో… గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు. ఇక పంజాబ్ జట్టు పైన కూడా ఈ ఇద్దరు ప్లేయర్లు రాణిస్తారు. సూర్య కుమార్ యాదవ్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఇలాంటి నేపథ్యంలో… ఫైనల్ కు ముంబై ఇండియన్స్ వస్తుందని కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కనుక ఫైనల్ కు వస్తే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం చాలా కష్టమని.. జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబై లాంటి బలమైన జట్టును గెలవడం… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అసాధ్యమని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే… ఒకే ఒక్క స్టెప్ అంటూ విరాట్ కోహ్లీ మొన్న చూపించిన ఫోటోను వైరల్ చేస్తున్నారు అదే సమయంలో ఆరవ టైటిల్ గెలవబోతున్నట్లు నీతా అంబానీ ఇచ్చిన సిగ్నల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారనే టెన్షన్ అందరిలోనూ ఉంది.