OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో జరుగుతూ ఉంటుంది. వేశ్య వృత్తిని నడుపుతున్న ఒక ఇంటిని, అధికారులు ఖాళీ చేపించే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ చూస్తే, ఎవరికైనా కళ్ళు చమ్మగిల్లుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ మూవీ పేరు ‘రాజ్‌కహిని‘ (Rajkahini). ఈ మూవీకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రితుపర్ణ సేన్‌గుప్తా, ఛటర్జీ, కౌశిక్ సేన్, జిషు సేన్‌గుప్తా, అబిర్ ఛటర్జీ, జయ అహ్సన్ నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ, వాణిజ్యపరంగా మంచి విజయం సాధించింది. వేశ్యల జీవితాలు ఎంత దారుణంగా ఉండేవో, ఈ మూవీలో చూపించారు మేకర్స్. ఈ బెంగాలీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఇండియాకి స్వతంత్రం వస్తున్న క్రమంలో భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు గీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఈ సందర్భంలో అక్కడికి వచ్చిన అధికారులు, ఆ ప్రాంతంలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని చూస్తారు. దగ్గర్లో ఒక వేశ్య గృహం ఉండటంతో, వాళ్లను ఇల్లు ఖాళీ చేయమని అడుగుతారు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో, ఎలాగైనా ఖాళీ చేయించాలని అధికారులు అనుకుంటారు. ఆ ఇంటిని నడుపుతున్న బేగంజాన్, ఈ విషయం మీద రాజు సహాయం అడుగుతుంది. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చిన ప్రతి అమ్మాయిని, మొదట అక్కడికే పంపుతూ ఉండేది బేగంజాన్. కాలం మారిపోయిందని, నా చేతుల్లో కూడా ఏమీ లేదని బేగంజాన్ కి చెప్తాడు రాజు. బేగంజాన్ తో సహా చివరికి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అధికారులపై పోరాటానికి సిద్ధపడతారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కబీర్ అనే రౌడీ సాయం తీసుకుంటారు. ఆ ఇంట్లో వాళ్లని బెదిరించి, అక్కడి నుండి పంపించాలని అతనికి చెప్తారు.
మొదట ఆ ఇంట్లో ఒక వేశ్యని ప్రేమిస్తున్నానని చెప్పి, ఒక పండితుడు మోసంచేస్తాడు. ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి అప్పగించి, ఘోరాలు చెపిస్తాడు. ఆతరువాత కబీర్ ఆ ఇంటిలో ఉన్న కుక్కలను చంపి వాళ్ళను బెదిరిస్తాడు. అప్పటికీ వినకపోవడంతో, రౌడీముకలతో కలసి వాళ్లల్లో కొంతమందిని చంపేస్తాడు కబీర్. చివరికి ఆ ఇంటిలో కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే మిగులుతారు. అయితే ఆ అధికారులు వాళ్ళను ఆట బొమ్మల్లా చూడాలనుకుంటారు. వాళ్ళ చేతికి దొరకకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు మిగిలిన ఆడవాళ్ళు. చివరికి మిగిలిన ఆడవాళ్ళు కూడా చనిపోతారా? వాళ్ల మరణాలు అధికారులకు కనువిప్పు కలిగిస్తుందా? ఇంతకీ స్వతంత్రం ఎవరికి వచ్చింది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రాజ్‌కహిని’ (Rajkahini) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.