Sobhitha Dulipala : బాలీవుడ్ ముద్దుగుమ్మ అక్కినేని నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చైతన్యతో పెళ్లి తర్వాత ప్రతిరోజు ఈమె హార్ట్ టాపిక్ గా మారుతుంది. శోభిత గురించి తెలుసుకోవాలని ఇటు నాగచైతన్య ఫ్యాన్స్ అక్కినేని అభిమానులు గూగుల్లో తెగ వెతికేస్తూ ఉంటారు.. నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో ప్రేమాయణం నడిపించారు ఇటీవలే వీళ్ళిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శోభిత అక్కినేని కోడలి రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే గుడ్ న్యూస్ అంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు శోభిత తన పోస్టులో ఏం రాసుకోచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తాను చాటుతున్న శోభిత ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేయడంతో పాటుగా లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది. పెళ్లయిన రెండు నెలలకి శోభిత ఇలా గుడ్ న్యూస్ అని పెట్టగానే అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. గుడ్ న్యూస్ అంటే అందరూ అనుకునే గుడ్ న్యూస్ కాదని ఆమె పోస్ట్ ని చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. శోభిత హీరోయిన్గా నటించిన ది మంకీ మ్యాన్ అనే మూవీకి సంబంధించిన న్యూస్ అది. ఈ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ లో నామినేషన్స్ ని సంపాదించుకుంటూ సంచలనం సృష్టించింది. రీసెంట్ గానే ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక బాఫ్తా లో బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ కేటగిరీలో చోటు దక్కింది..
అంతేకాదు.. రాటెన్ టొమోటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీ గా మొదటి స్థానంలో నిల్చింది. దీనిపై ఆమె స్పందిస్తూ ఇది కలనా నిజామా అనే ఆశ్చర్యంలో ఉన్నాను. ఏంటి నేను నటించిన సినిమా అవార్డుకి ఎంపికైన అది కూడా అంతర్జాతీయ స్థాయిలో అవార్డుకి ఎంపికైందంటే నాకు చాలా సంతోషంగానూ ఆశ్చర్యంగానూ ఉందంటూ శోభిత తన పోస్ట్ లో పేర్కొంది. ఈ మూవీ 2024 బాఫ్తా యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఎంపికైంది. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అంటూ ఆమె ఒక పోస్ట్ ని షేర్ చేసింది. అదే శోభిత చెప్పిన గుడ్ న్యూస్.. శోభిత బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సినిమా చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నటించిన గూడచారి అనే మూవీ లో శోభిత కీలకపాత్రలో నటించినది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో తెలుగు లో అవకాశాలు వచ్చాయి కానీ, తెలుగు కంటే హిందీ లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. కానీ హిందీలోనే ఆమె హీరోయిన్గా సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఇదంతా పక్కన పెడితే నాగచైతన్యతో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక నాగచైతన్యతో ఫ్యూచర్ లో ఏమైనా సినిమా చేస్తుందేమో చూడాలి.. ప్రస్తుతం అయితే శోభిత సినిమాలకు కాస్త దూరంగా ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. మరి దీనిపై శోభిత క్లారిటీ ఇవ్వాల్సింది.. అటు నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నారు. ఆ మూవీ సమ్మర్ లో విడుదల కానుంది..