E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

ఓటీటీలోకి వచ్చేస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
Advertisement

Peddi Movie : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం పెద్ది.. త్రిబుల్ ఆర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ది మూవీ ప్రస్తుతం 400 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా రామ్ చరణ్ కు ఈ సినిమాతో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.. డైరెక్టర్ బుజ్జి బాబు దర్శకత్వంలో దొరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను అందుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీలో చూస్తామని మెగా ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఈ చిత్రం ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కి రాబోతుందో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఓటీటీలోకి రాబోతున్న పెద్ది..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బా లీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది.. తెలుగులో ఉప్పెన మూవీతో మంచి క్రియేషన్ సంపాదించుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో వచ్చిన ఈ స్టోరీ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. భావోద్వేగపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.. థియేటర్లలో సక్సెస్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 105 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి డీల్ కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను అందుకుంది.. దాంతో జూలై రెండో వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక రాబోతుందని టాక్..

Advertisement

Also Read : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

3 గంటలకు పైగా రన్ టైం..

గతంలో ఎన్నడూ కనిపించని మాస్ లుక్ లో రామ్ చరణ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఈ మూవీ స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతుంది.. ఇందులో అప్పల సూరి పాత్రలో నటించిన సీనియర్ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ఇకపోతే రిలీజ్ అయ్యాక జాన్వీ కపూర్ సీన్లపై విమర్శలు రావడంతో కొన్నింటిని తొలగించారు.. ప్రస్తుతం కొత్త సీన్లను యాడ్ చేసి మరి ఈ సినిమాని థియేటర్లలో రన్ చేస్తున్నారు. థియేటర్లలో ట్రిమ్ చేసిన కొన్ని కీలకమైన ఎమోషనల్, రొమాంటిక్, అలాగే తీసేసిన కొన్ని సెంటిమెంట్ డైలాగులు ఓటీటీ లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఓటీటీలోకి రాబోతున్న సినిమాకు ఎటువంటి కట్స్ లేకుండా తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఓటీటీ వెర్షన్ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 25 నిమిషాలకు కట్ చేశారని సమాచారం.. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ అయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుంది చూడాలి..

Tags

Related News

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు… ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big Stories

Advertisement
×