E-Paper

మా పాక్ ప్లేయ‌ర్ల‌కు కూడా కాలి బూటు చూపించాడు..వైభ‌వ్ పై ప‌ర్మినెంట్ బ్యాన్ వేయాలి

మా పాక్ ప్లేయ‌ర్ల‌కు కూడా కాలి బూటు చూపించాడు..వైభ‌వ్ పై ప‌ర్మినెంట్ బ్యాన్ వేయాలి
Advertisement

Salman Butt: శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ (VAIBHAV SURYAVANSHI Fight) గొడవ పడ్డ సంఘటనపై రకరకాల వాదనలు వస్తున్నాయి. ఇందులో శ్రీలంక ప్లేయర్లది తప్పిదమంటూ ఇండియన్స్ వాదిస్తుంటే, వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi ) దూకుడుగా వ్యవహరించాడని శ్రీలంకతో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ కెరీర్ ను దెబ్బకొట్టేలా కుట్రలకు తెర లేపుతున్నారు. మొగ్గ దశలోనే వైభవ్ కెరీర్ క్లోజ్ చేసే కుట్ర జరుగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ అలాగే శ్రీలంక మాజీ క్రికెటర్లందరూ కూడా గట్టుకొని.. వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పై పర్మినెంట్ బ్యాన్ విధించాలంటూ పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ (Salman Butt) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్లేయర్లతో గొడవే కాకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లకు కాలి బూట్లు చూపించాలని పాత విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి వెధవలపై ఐసీసీ బ్యాన్ విధించాల్సిందేనని డిమాండ్ చేశారు. వైభ‌వ్ ఎంత బాగా ఆడ‌తాడో..అంతే పొగ‌ర‌బోతు అంటూ ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

పాక్ ప్లేయ‌ర్ల‌కు కూడా కాలి బూటు చూపించాడు..వైభ‌వ్ పై బ్యాన్ వేయాలి

Advertisement

శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ పడ్డ సంఘటనపై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ (Salman Butt) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో వైభవ్ సూర్య వంశీ తప్పిదం 100% ఉందని బాంబు పేల్చారు. వైభవ్ సూర్య వంశీ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ అని ప్రశంసించిన సల్మాన్ భట్, భవిష్యత్తులో మంచి ఆటగాడు అవుతాడని వ్యాఖ్యానించారు. అయితే మంచి టాలెంట్ ఉన్న వైభవ్ సూర్య వంశీ, క్యారెక్టర్ లో మాత్రం నెగటివ్ మార్కులు తెచ్చుకుంటున్నాడని సీరియస్ అయ్యారు. శ్రీలంక ప్లేయర్లతో గొడవపడ్డ వైభవ్, ఆసియా కప్ సమయంలో తమ పాకిస్తాన్ ప్లేయర్లతో కూడా గొడవ పడినట్లు గుర్తు చేశారు.

అలీ రాజా లాంటి ఉత్తమ బౌలర్ ను ఉద్దేశించి, తన కాలి బూట్లు చూపించాడని మండిపడ్డారు. తోటి ఆటగాళ్లను గౌరవించలేని వైభవ్, ఎంత మంచి ఇన్నింగ్స్ లు ఆడినా కూడా దండగే అంటూ చురకలు అంటించారు. ఇలాంటి ఆటగాళ్లపై పర్మినెంట్ బ్యాన్ విధించాలని ఐసీసీ డిమాండ్ చేశారు. లేకపోతే ఇండియన్ క్రికెటర్లు మరింత రెచ్చిపోయి, ఇతర ప్లేయర్లపై దాడులు చేస్తారని సీరియస్ అయ్యారు. వైభవ్ కు ఉన్నంత అహంకారం ఎవరికి లేదని..ఈ అహంకారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు సల్మాన్ భట్.

Advertisement

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

 

 

Related News

బంగ్లాదేశ్ లో దంచికొడుతున్న ఎండ‌లు..మైదానంలోనే కుప్ప‌కూలిన‌ టిమ్ డేవిడ్

పేరుకే సుంద‌ర్ ఆల్ రౌండర్, కానీ పీకిందేమి లేదు.. వాడి వ‌ల్ల రూపాయి లాభం లేదు

లంక ప్లేయ‌ర్ ఒక్క‌డినే బ‌లి చేస్తారా ? వైభ‌వ్ ఏమైనా సుద్ధ పూసనా, త‌న్ని త‌రిమికొట్టండి !

వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌, ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌

Adi Reddy: హనుమంతుడిలాగా శ్రీలంక‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ త‌గ‌ల‌బెడ‌తాడు

ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్న అశ్విన్

×