E-Paper
Advertisement

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller: హారర్ సినిమాలు అంటే చాలా మంది దెయ్యాలు, శాపాలు, ఆత్మల కథలనే ఊహిస్తారు. కానీ మనుషులే రాక్షసులుగా మారితే ? పిల్లలు చదువుకునే స్కూలే ప్రాణాలు తీసే ఉచ్చుగా మారితే ? అలాంటి భయంకరమైన కాన్సెప్ట్‌తో రూపొందిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘Labinak They Are Almost Us’. ప్రస్తుతం ఓ దిగ్గజ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2025లో విడుదలైన ఈ చిత్రం సాధారణ హారర్ సినిమాల్లా కాకుండా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. స్కూల్ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచుతూనే, చివరి వరకు ప్రేక్షకుడిని భయంతో సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. దెయ్యాల కంటే మనుషుల్లో దాగి ఉన్న క్రూరత్వమే ఎంత ప్రమాదకరమో చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, డార్క్ విజువల్స్, షాకింగ్ ట్విస్టులతో హారర్ అభిమానులకు ఇది ఓ ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. మరి ఐ ఫీస్ట్ లాంటి ఈ హర్రర్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

అడవులకు సమీపంలో ఉన్న ఒక పాత బోర్డింగ్ స్కూల్‌లో ఈ కథ మొదలవుతుంది. బయటకు చూస్తే ఆ విద్యాసంస్థ చాలా క్రమశిక్షణతో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోవడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. స్కూల్ యాజమాన్యం మాత్రం వాళ్ళు పారిపోయారని, కుటుంబ సమస్యల వల్ల వెళ్లిపోయారని చెబుతూ ప్రతి ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే వరుసగా విద్యార్థులు అదృశ్యమవుతుండటంతో కొందరు విద్యార్థులకు అనుమానాలు మొదలవుతాయి.

Advertisement

స్కూల్‌లోని కొన్ని నిషేధిత ప్రాంతాల్లో రాత్రివేళ వినిపించే వింత శబ్దాలు, రహస్య సమావేశాలు, టీచర్ల అనుమానాస్పద ప్రవర్తన వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని కొంతమంది స్టూడెంట్స్ గ్రహిస్తారు. నిజం తెలుసుకోవాలని ప్రయత్నించిన కొద్దీ మరింత భయంకరమైన విషయాలు బయటపడతాయి. స్కూల్‌లో పని చేస్తున్న ఒక సైకో టీచర్, ఆమెతో కలిసి ఉన్న కొందరు సిబ్బంది పురాతన క్షుద్ర పూజల కోసం విద్యార్థులను బలిగా ఇస్తున్నారనే విషయం బయట పడుతుంది. అక్కడితో ఆగకుండా, వాళ్ళు చేసే పనులు మరింత భయంకరంగా మారుతాయి.

ఈ నిజం తెలిసిన తర్వాత కొందరు విద్యార్థులు అక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ స్కూల్ మొత్తం ఒక ఉచ్చులా మారిపోతుంది. ప్రతి అడుగులో ప్రమాదం, ప్రతి గదిలో ఒక రహస్యం, ప్రతి వ్యక్తిపై అనుమానం. ప్రాణాలు కాపాడుకోవాలంటే ధైర్యంతో పాటు తెలివితేటలు కూడా అవసరమవుతాయి. చివరికి ఆ స్కూల్‌లో జరుగుతున్న దారుణాలకు ముగింపు పలికారా ? విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారా ? ఆ సైకో టీచర్ వెనుక అసలు కథ ఏమిటి ? అనే విషయాలను మాత్రం సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ లేదు

Advertisement

ఈ సినిమాకు ప్రధాన బలం వాతావరణం. మొదటి సన్నివేశం నుంచే భయాన్ని నెమ్మదిగా పెంచుతూ దర్శకుడు కథను ముందుకు తీసుకెళ్తాడు. సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే జంప్ స్కేర్స్ కంటే మానసిక భయాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. సైకో టీచర్ పాత్రలో నటించిన నటి తన హావభావాలతోనే భయపెట్టగలిగింది. డార్క్ సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా Netflixలో ఇంగ్లీష్ ఆడియోతో, సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో తీవ్రమైన హింసాత్మక దృశ్యాలు, భయంకరమైన అంశాలు ఉన్నాయి, కాబట్టి ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన చిత్రం. సైకలాజికల్ హారర్, సస్పెన్స్, డార్క్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి మంచి విందులాంటిది ఈ మూవీ.

Read Also: కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×