E-Paper
Advertisement

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!
Advertisement

Gen Z: ఒకప్పుడు ఎలా ఉండేది.. సాయంత్రం ఏడు గంటలు దాటితే చాలు ఇంటిలో ఉన్న వాళ్ళంతా కలిసి టీవీ ముందు కూర్చునేవాళ్ళు. టీవీలో వచ్చే సీరియల్స్, సినిమాలు, క్రికెట్ మ్యాచెస్.. ఇలా ఏ ప్రోగ్రాం అయినా టైం అంటే టైమే.

ఒకప్పుడు టీవీ.. ఇప్పుడు ఓటీటీ

కానీ ఇప్పుడు సీన్ మారింది. టీవీలో ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళకన్నా ఫోన్‌లో లేదా లాప్టాప్‌లో ఓటీటీలో చూస్తున్న వాళ్లే ఎక్కువ. ముఖ్యంగా జెన్ జీ పిల్లలు టీవీ వద్దు.. ఓటీటీలే ముద్దు అనేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5.. ఇలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తమ ఫేవరెట్ అనేస్తున్నారు.

జెన్ జీకి టీవీ ఎందుకు బోర్?

Advertisement

ఒకప్పుడు టీవీలో సినిమా చూడాలంటే ఆదివారం దాకా వెయిట్ చేయాలి. ఇక సీరియల్ చూడాలంటే రాత్రి 8 గంటల వరకు ఆగాల్సిందే. కానీ మాకు అంత పేషన్స్ లేదంటున్నారు జెన్ జీ బ్యాచ్. అవును.. ఇలా చూడాలి అన్న ఆలోచన వచ్చిందంటే చాలు.. ఓటీటీ ఓపెన్ కావాల్సిందే.

యాడ్స్ అంటే అస్సలు పడడం లేదు

ఇక ముఖ్యంగా జెన్ జీ యూత్‌కి యాడ్స్ అంటే అస్సలు పడదు. టీవీలో సినిమా చూస్తున్నా, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, సీరియల్స్ చూస్తున్నా.. ఇలా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేసే యాడ్స్ కుప్పలు తిప్పలుగా వచ్చేస్తుంటాయి.

చూడాలనిపిస్తే వెంటనే చూసే ఫ్రీడమ్

Advertisement

అందుకే మాకు యాడ్స్ వద్దు బాబోయ్ అంటూ యాడ్స్ తక్కువగా ఉండే ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు అంతా. ఇక టీవీలో ఏం వస్తే అదే చూడాలి. మనకు మార్చే అవకాశం లేదు. కానీ ఓటీటీ మాత్రం పిచ్చ ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. యాక్షన్ కావాలా, కామెడీ కావాలా, హాలీవుడ్ సినిమా కావాలా, కొరియన్ డ్రామా కావాలా.. అన్ని ఫింగర్ టిప్స్ మీదే. ఇలా అనుకుంటే చాలు.. స్క్రీన్ మీద ప్రత్యక్షమైపోతుంది. అందుకే జెన్ జీ యూత్‌కి ఓటీటీ బాగా దగ్గరైపోయింది.

ఇక టీవీలో ఒక ఎపిసోడ్ చూసాక చివర్లో ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ కనిపిస్తుంది. అదే తర్వాత ఎపిసోడ్ చూడాలంటే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే.కానీ ఓటీటీలో అలా కాదు. ఒకేసారి సీజన్ మొత్తం అవైలబుల్ ఉంటుంది. దీంతో ఆ సీజన్ కంప్లీట్ చేసి గానీ పడుకోవట్లేదు జెన్ జీ యూత్. ఎక్సైట్మెంట్ అలాంటిది మరి.

ఎక్కడైనా.. ఎప్పుడైనా ఎంటర్‌టైన్‌మెంట్

ఇక వీటి కన్నా ముఖ్యంగా జెన్ జీ యూత్‌కి టీవీ ముందు కూర్చోవాల్సిన అవసరమే లేదు. ట్రైన్‌లో, కారులో, బస్సులో, కాలేజీ బ్రేకుల్లో.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఫోన్ ఓపెన్ చేసి అనుకున్న సినిమాని, వెబ్ సిరీస్‌ని.. ఇలా ఏదైనా వెంటనే చూసేయొచ్చు.

సినిమాల కంటే వెబ్ సిరీస్‌లకే ఎక్కువ క్రేజ్

ఒకరకంగా ఈ ఫెసిలిటీయే ఓటీటీని యూత్‌కి మరింత దగ్గర చేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు చాలామంది జెన్ జీ యూత్ సినిమా కంటే వెబ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రెండు గంటల సినిమా అంటే రెండు గంటల టైంపాస్. కానీ వెబ్ సిరీస్ మరింత టైంపాస్. ఇంట్రెస్టింగ్ కంటెంట్, సాలిడ్ క్యారెక్టరైజేషన్స్, క్యూరియాసిటీ పెంచే సస్పెన్స్.. ఇలా అన్నీ కలగలిపి వస్తున్న వెబ్ సిరీస్ అంటే పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటి జెన్ జీ బ్యాచ్.

సోషల్ మీడియానే కొత్త గైడ్

ఇంతకుముందు సినిమా ఎలా ఉంది అనేది టీవీలో ప్రోమో చూసి ఫిక్స్ అయిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, రివ్యూ టాక్స్.. ఇలా ఏ సినిమా చూడాలో క్షణాల్లో డిసైడ్ అయిపోతున్నారు. అలా ఇప్పుడు సోషల్ మీడియానే ఒక కొత్త గైడ్ అయిపోయింది మరి.

టీవీ పూర్తిగా కనుమరుగవుతుందా?

ఓటీటీల డామినేషన్ నడుస్తున్న ఈ కాలంలో టీవీలు కనిపించకుండా పోతాయా అంటే చెప్పలేం. ఎందుకంటే చాలా ఇళ్లల్లో ఇప్పటికీ వార్తలు, పెద్ద పెద్ద ఈవెంట్లు, రియాలిటీ షోలు, క్రికెట్ మ్యాచ్లు అన్నీ టీవీలోనే చూస్తున్నారు. అలా చూస్తేనే సరైన అనుభూతి అని భావిస్తున్నారు.

జెన్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టైల్ పూర్తిగా చేంజ్ 

కానీ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రం ఎక్కువగా ఓటీటీనేం ప్రిఫర్ చేస్తుంది జెన్ జీ యూత్. ఏది ఏమైనా టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆడియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అప్రోచ్ చేసే విధానం కూడా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటి జెన్ జీ బ్యాచ్‌కి టైం చాలా వాల్యూ. వాళ్లు చూడాలనుకున్న సినిమా, వెబ్ సిరీస్ లేదంటే కంటెంట్‌ని వాళ్లకు నచ్చిన సమయంలో, అందుబాటులో ఉన్న డివైస్‌లో చూసేస్తున్నారు.

also read :భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

అందుకే టీవీల క్రేజ్ తగ్గిపోతుంది.. ఓటీటీకి ఉన్న క్రేజ్ పెరిగిపోతుంది. చూస్తుంటే వచ్చే రోజుల్లో ఇది మరింత పెరిగిపోయేలానే ఉంది!

Tags

Related News

చిన్న కిచెన్‌ను పెద్దదిలా చూపించే సింపుల్ ట్రిక్స్!

భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

Big Stories

Advertisement
×