E-Paper
Advertisement

Payyavula Keshav: పయ్యావుల దెబ్బకు వైసీపీ సైలెంట్.. అసలేం జరిగిందంటే?

Payyavula Keshav: పయ్యావుల దెబ్బకు వైసీపీ సైలెంట్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. ఈ సెషన్స్‌లో బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులకంటే ఒక్కే ఒక్కరు హైలెట్ అవుతున్నారు. సెషన్స్ ముగిసి రోజులు గడుస్తున్నా, ఇటు కూటమి పార్టీల్లో, అటు వైసీపీలో మంత్రి పయ్యావుల కేశవ్ ఉభయ సభల్లో చూపించిన పరిపక్వత చర్చల్లో నలుగుతూనే ఉంది. ఫస్ట్ టైం మినిస్టర్ అయిన సీనియర్ నేత పయ్యావుల.. తన లాజికల్ వాదనలతో అటు విపక్షాలకు వణుకు పుట్టించడమే కాక, అధికారపార్టీకి అటువంటి నాయకుడు ఎంత అవసరమో చాటిచెప్పారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఉభయ సభల్లో పయ్యావుల వన్ మ్యాన్ షో!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటు శాసనసభ, ఇటు శాసన మండలిలో ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వన్ మ్యాన్‌షోతో అదరగొట్టారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎంలు శాసనమండలికి దూరంగా ఉన్న తరుణంలో.. ఉభయ సభల్లోనూ ఫస్ట్ టైం మినిస్టర్ అయిన సీనియర్ నేత పయ్యావుల, ప్రభుత్వం వాయిస్ సమర్ధంగా వినిపించి హైలెట్ అయ్యారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి థీటుగా బలులిచ్చే సీనియర్లకు కొదవ ఉండేది కాదు. చంద్రబాబు సహా యనమల రామకృష్ణుడు ఇతర సీనియర్లు తమ వాక్చాతుర్యంతో ప్రత్యర్ధుల వాయిస్‌కు చెక్ పెట్టేవారు. అయితే ఈ సారి యంగ్ మంత్రివర్గం మంత్రం పఠిస్తున్న టీడీపీలో వన్ మ్యాన్ షో నడిచింది. తన లాజికల్ వాదనలతో అటు విపక్షాలకు వణుకు పుట్టించడమే కాక, అధికారపార్టీకి అటువంటి నాయకుడు ఎంత అవసరమో చాటిచెప్పారు.

పయ్యావుల రాజకీయ ప్రస్థానం

Advertisement

ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు నమ్మకస్తుల్లో ఒకరైన పయ్యావుల వాగ్దాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూటిగా సుత్తి లేకుండా సబ్జెక్ట్ బేస్డ్‌గా మాట్లాడటంలో కేశవ్‌ పరిణితి చెందారు. పరుషపదజాలం లేకుండా ప్రత్యర్ధులను టార్గెట్ చేయడంలోనూ ఆయన స్టైలే డిఫరెంట్‌గా ఉంటుంది. ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యేగా ఏడు సార్లు పోటీ 5 సార్లు గెలిచిన పయ్యావుల కేశవ్ కష్టకాలంలో పార్టీ అండగా వాయిస్ వినిపించే సీనియర్ నేతల్లో ముందువరుసలో ఉంటారు. అయితే గత ఎన్నికల్లో విజయం సాధించే వరకు ఆయన సీనియార్టీకి తగిన గుర్తింపు దక్కలేదు.

నెగిటివ్ సెంటిమెంట్‌కు బ్రేక్

పయ్యావుల బ్యాడ్ టైమో లేకపోతే పార్టీ బ్యాడ్ టైమో కాని ఆయన ఉరవకొండలో గెలిస్తే టీడీపీ అధికారంలోకి రాదన్న ముద్ర ఉండేది. దానికి తగ్గట్లే 1999, 2014 ఎన్నికల్లో టీడీపీ పవర్ లోకి వస్తే దురదృష్టవశాత్తు కేశవ్ ఓడిపోయారు. అయితే ఆ నెగిటివ్ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తూ 2024లో గెలుపొందిన ఉరవకొండ ఫైర్ బ్రాండ్ తన కెరీర్లో తొలిసారి మంత్రయ్యారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు. అసెంబ్లీ వ్యవహారాలు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తాజా బడ్జెట్ సెషన్స్‌లో తానేంటో నిరూపించుకున్నారు.

డేటాతో దుమ్మురేపిన పయ్యావుల స్పీచ్

Advertisement

పయ్యావుల మాట్లాడే శైలి సాధారణంగా డేటా బేస్డ్‌గా, చేస్తున్న ఆరోపణలకు ప్రత్యక్ష ఉదాహరణలతో సాగుతూ, ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకే సభలో ఆయన స్పీచ్ ఎప్పటికప్పడు హైలెట్ అవుతుంటుంది. ఆ వాగ్దాటితోనే తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో అటు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ఇటు శాసనమండలిలో వైసీపీ సభ్యులకు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆయన ‘ఊపేశారు” అని పార్టీల కతీతంగా నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

జగన్‌పై పయ్యావుల సెటైర్లు

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని టార్గెట్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. వైసీపీ సభ్యుల తరహాలో అసభ్యతకు తావివ్వకుండా ఆయన వేసిన సెటైర్లు హైలెట్ అవుతున్నాయి. మాజీ సీఎం జగన్‌ని పులివెందుల ఎమ్మెల్యే అంటూ.. పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లాల వారీ సమీక్షల్లో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. పులివెందుల సమస్యలను గత పాలకులు గాలికి వదిలేస్తే.. కూటమి ప్రభుత్వం పరిష్కారానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆ క్రమంలో రాష్ట్రానికి వైసీపీ హానికరమనే వార్నింగ్‌ ఇస్తూ.. ‘వైసీపీ నెవర్‌ ఎగైన్‌.. వన్స్‌ ఎగైన్‌ కూటమి’ అని పయ్యావుల కేశవ్‌ చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లకు నినాదంగా మారుతున్నాయి.

లోకేష్ కౌంటర్లు.. వైసీపీ నిశ్శబ్దం

ఇక శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నా, మంత్రి నారా లోకేష్‌తో కలిసి కేశవ్ వారి నోళ్లు మూయించిన తీరుపై కూటమి శ్రేణులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యానారాయణ వంటి సీనియర్ పయ్యావుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబాటుకు గురయ్యారు. ఆ క్రమంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసలు కురిపించారు. పయ్యావుల కేశవ్ లాంటి వారు తోడుంటే చంద్రబాబుకి ఏదైనే సాధ్యమే అని జనసేనాని స్వయంగా అన్నారంటే సభలో కేశవ్ అప్రోచ్ ఎలా ఉందో అర్థమవుతుంది.

సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తే ఇలా ఉంటుందా..

సబ్జెక్ట్ ఉన్న సీనియర్లకు ప్రయార్టీ ఇస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నిరూపించారు పయ్యావుల. ఫ్యూచర్ అవసరాలు, యూత్ కి ప్రాధాన్యత అంటూ రూల్స్ పెట్టుకోకుండా… పార్టీకి ముందు నుంచి అండగా ఉంటూ, చంద్రబాబు పర్సనల్ సైన్యం లాంటి వారికి సముచిత ప్రాధాన్యత ఇస్తేనే పార్టీకి తిరుగుండదని సూచిస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో పయ్యావులు కేశవ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యారని చెప్పవచ్చు.

Also Read:గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×