E-Paper
Advertisement

OTT Movie : మూవీ రిహార్సల్స్ పేరుతో బట్టలన్నీ విప్పించే డైరెక్టర్… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా సామీ

OTT Movie : మూవీ రిహార్సల్స్ పేరుతో బట్టలన్నీ విప్పించే డైరెక్టర్… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమారా సామీ
Advertisement

OTT Movie : సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ల హడావిడి కూడా ఎక్కువగానే ఉంది. వీటిని సెల్ ఫోన్ లతోనే చిత్రీకరిస్తూ ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ లకు అవార్డులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనము చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్, సినిమా ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆలోచింపజేస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….

యూట్యూబ్‌లో

Advertisement

‘రిహార్సల్’ (Rehearsal) 2019లో విడుదలైన హిందీ షార్ట్ ఫిల్మ్. ఇది కోర్ట్నీ హోప్ థెరాండ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో జెస్సికా మెండెజ్ సిక్విరోస్, క్లింటన్ లోవ్, అలెగ్జాండర్ చార్డ్, అలెక్స్ పోర్టెంకో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఎన్‌కౌంటర్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం ఒక సినిమా సెట్‌లో, మహిళా నటి ఎదుర్కొనే స్సన్నివేశాలను చూపిస్తుంది. యూట్యూబ్‌ (Youtube) లో ఇది అందుబాటులో ఉంది. IMDbలో దీనికి 5.8/10 రేటింగ్ కూడా ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ కథ ఒక సినిమా షూటింగ్‌కి ముందు జరిగే రిహార్సల్ సీన్‌ చుట్టూ తిరుగుతుంది. ఒక ఫీచర్ ఫిల్మ్ కోసం హీరో, హీరోయిన్ తో ఒక డైరెక్టర్ ఒక సీన్‌ను రిహార్సల్ చేపిస్తుంటాడు. అయితే ఈ సీన్‌లో కొంత ఇంటిమేట్ మూమెంట్స్ ఉంటాయి. కానీ రిహార్సల్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ (జెస్సికా మెండెజ్ సిక్విరోస్) కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. డైరెక్టర్, ఇతర సిబ్బంది ఆమెను సీన్‌ను మరింత “నీట్‌గా” చేయమని, కొన్ని ఎక్స్‌ట్రా స్టెప్స్ తీసుకోమని చెబుతారు. కానీ ఆమె దానికి సౌకర్యంగా లేనట్లు అనిపిస్తుంది. ఇక్కడే కథలోని అసలు సమస్య మొదలవుతుంది. ఆమె ఒత్తిడిని తట్టుకోలేక, “నో” చెప్పలేక, సీన్‌ను కొనసాగిస్తుంది.

Read Also : ఇక్కడ వర్షం పడితే చావు మూడినట్టే… ఒక్కో చినుకుకు ఒక్కో ప్రాణం బలి… హర్రర్ మూవీ లవర్స్ కు ట్రీట్

డైరెక్టర్, హీరో ఎవరూ గాని ఆమెను బలవంతం చేయడం లేదు. కానీ ఆసమయంలో వాళ్ల చిన్న చిన్న సూచనలు ఆమెను ఒక అసౌకర్యమైన సిచుయేషన్‌లోకి నెట్టేస్తాయి. ఆమె మనసులో ఒక రకమైన గందరగోళం మొదలవుతుంది. ఈ సీన్ రిహార్సల్ అని చెప్పినా, ఆమె బౌండరీలు దాటబడతాయి. ఆమె ఒక రకమైన మైకంలోకి వెళ్ళిపోతుంది. చివర్లో, ఆమె ఈ అనుభవం గురించి ఆలోచిస్తూ, తన తనను తానూ ప్రశ్నించుకుంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ, ఓపెన్-ఎండెడ్‌గా ముగుస్తుంది. .OTT వివరాలు

రిహార్సల్ ప్రస్తుతం షార్ట్‌ఫిల్మ్స్.వాచ్లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది, కానీ ప్లస్ లేదా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఇది యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది, కానీ కొన్ని రిజిస్టర్డ్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే. BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూ ఓర్లీన్స్, మరియు నాష్‌విల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం ప్రదర్శించబడింది.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×