Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు… ఒక్కడు, పోకిరి, బిజినెస్ మెన్, అతడు, ఖలేజ, అతిథి, టక్కరి దొంగ, నిజం లాంటి సినిమాల్లో లుక్ పరంగా మంచి వేరియేషన్స్ చూపించాడు. ఈ మోవిఎలోని ఏ సీన్ లోని ఏ స్టిల్ ని చూపించినా ఫాన్స్ మూవీ టైటిల్ ని వెంటనే చెప్పేస్తారు. యాక్టింగ్ పరంగా కూడా ఈ మూవీస్ లో మహేష్ బాబు వేరియేషన్స్ పర్ఫెక్ట్ గా చూపించాడు. అందుకే మహేష్ కెరీర్ లో ఈ మూవీస్ చాలా స్పెషల్ గా ఉంటాయి.
ఘట్టమనేని ఫ్యాన్స్ వింటేజ్ మహేష్ బాబు కావాలి అని అడిగేది కూడా ఈ మూవీని చూసే… అంతలా లుక్స్ విషయంలో కేర్ తీసుకునే మహేష్ బాబుని కొరటాల శివ వచ్చిన తర్వాత మొత్తం మార్చేసాడు. శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ సైలెంట్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేసాడు. భరత్ అనే నేను, మహర్షి సెకండ్ హాఫ్ లుక్, బ్రహ్మోత్సవం, స్పైడర్… ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీమంతుడు నుంచి గుంటూరు కారం ముందు వరకూ మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ ఒకటే మోడ్ లో ఉంటాయి.
సైలెంట్ డైలాగ్ డెలివరీ, లాస్ట్ లో ఒక మెసేజ్, క్లీన్ లుక్స్… ఇవే మహేష్ సినిమాల్లో కనిపించిన విషయాలు. ఒకానొక సమయంలో ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఒక్కసారి బిజినెస్ మెన్ లాంటి సినిమా చేయమని మహేష్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు అంటే ఆ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు, డీసెంట్ లుక్స్ ఎంత ఇబ్బంది పెట్టాయో అర్ధం చేసుకోవచ్చు.
సింపుల్ గా చెప్పాలి అంటే శ్రీమంతుడు సినిమా నుంచి సర్కారు వారి పాట వరకూ మహేష్ పోస్టర్స్ ని తీసి పక్కపక్కన పెడితే ఘట్టమనేని అభిమానులు కూడా ఏ లుక్ ఏ సినిమాలోదో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా వైట్ షర్ట్ లో ఉన్న ఫోటోస్, టైట్ క్లోజప్ ఫోటోస్ పెడితే అభిమానులు అసలు కనుక్కోలేరు. అభిమానులే కాదు ఏఐ చాట్ బాట్ గ్రోక్ కూడా మహెష్ బాబు ఏ సినిమాలో ఏ లుక్ లో ఉన్నాడో కనుక్కోలేక కన్ఫ్యూజ్ అయ్యింది.
మహేష్ బాబు వైట్ షర్ట్ లో ఉన్న నాలుగు ఫోటోస్ పక్కపక్కన పెడితే గ్రోక్ కూడా కనుక్కోలేకపోయింది. దీంతో మహేష్ బాబు, మేమే కనుక్కోలేకపోతున్నాం ఇక నువ్వెంతలే అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఏదైమైనా గుంటూరు కారం సినిమా మహేష్ బాబుని చాలా రోజుల తర్వాత మంచి జోష్ ఉన్న క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసింది. ఇక బాబు నెక్స్ట్ జక్కన్నతో కాబట్టి లుక్స్ పరంగా కెరీర్ బెస్ట్ ఉండడం గ్యారెంటీ.