OTT Movie : నిజ జీవితంలోనే కాదు, సినిమా ప్రపంచంలో కూడా ప్రేమ కథలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో, ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమే. ఎన్నో సినిమాలు ఈ పాయింట్ మీదే వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఒక విచిత్రమైన లవ్ స్టోరీతో నడుస్తుంది. ఈ ప్రేమ కథ ఒక ఆర్ఫనేజ్‌లో సెంటర్ లో జరుగుతుంది. అయితే అక్కడ ఊహించని పరిణామాలు ఉంటాయి. క్లైమాక్స్ వరకు ఈ సినిమా అసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి సీన్స్ కూడా ఎక్కువే. అందుకే దీనిని ఒంటరిగా చూస్తేనే మంచిది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే
‘ది టియర్‌స్మిత్’ (The tearsmith) 2024లో వచ్చిన ఇటాలియన్ రొమాంటిక్ ఫాంటసీ సినిమా. అలెస్సాండ్రో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో క్యాథరీనా ఫెరియోలి, సిమోనే, సాబ్రీనా, ఎకో అండ్రియోలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. IMDbలో 5.2/10 రేటింగ్ పొందింది.
నీకా అనే టీనేజ్ అమ్మాయి, తన తల్లిదండ్రులను కార్ యాక్సిడెంట్‌లో కోల్పోతుంది. ఆ తరువాత ఒక అనాధ శరణాలయంలో పెరుగుతుంది. ఇక్కడ టియర్‌స్మిత్ అనే మిస్టీరియస్ వ్యక్తి వల్ల పిల్లలు భయ పడుతుంటారు. నీకా ఇక్కడ ఒంటరితనంతో బాధపడుతుంది. ఒక రోజు రిగెల్ అనే బాలుడు ఆర్ఫనేజ్‌లోకి వస్తాడు. రిగెల్ చాలా క్రూరమైనవాడు, అందరినీ భయపెడతాడు. నీకా, రిగెల్ మధ్య మొదట గొడవలు మొదలవుతాయి. కానీ క్రమంగా వాళ్ల మధ్య బాన్డ్ పెరుగుతుంది. వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.
Read Also : భార్య పోగానే గర్ల్ ఫ్రెండ్ తో హనీమూన్‌కు… మెంటల్ మాస్ ట్విస్టు మావా… క్రేజీ కొరియన్ హర్రర్ మూవీ