E-Paper
Advertisement

వయసు ఏమో ముప్పై.. మనసు మాత్రం ఇంకా స్వీట్ సెవంటీనే… గమ్మత్తుగా సాగే కొరియన్ డ్రామా

వయసు ఏమో ముప్పై.. మనసు మాత్రం ఇంకా స్వీట్ సెవంటీనే… గమ్మత్తుగా సాగే కొరియన్ డ్రామా
Advertisement

Romantic Drama OTT : ఒక మంచి కొరియన్ డ్రామాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను చూసేయండి. ఇందులో కామెడీతో పాటు, ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయి. ఈ కథ ఒక 17 ఏళ్ల అమ్మాయి ఒక ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్తుంది. ఆమె 13 ఏళ్ల తర్వాత అంటే 30 ఏళ్ల వయసులో కోమా నుండి మేల్కొంటుంది. ఆ తరువాత స్టోరీ చాలా ఆసక్తిగా సాగుతుంది. దీనికి ఐయండిబిలో 7.8 రేటింగ్ కూడా ఉంది. కే డ్రామాలను ఇష్టపడే వాళ్ళు ఓ చూపు చూడాల్సిన సిరీస్ ఇది. తెలుగులో కూడా ఈ సిరీస్ ను ఏంచెక్కా చూసేయచ్చు.

ఎక్కడ చూడచ్చు అంటే

2018లో వచ్చిన ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా పేరు ‘స్టిల్ 17’ (Still 17). ఈ సిరీస్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కథానాయిక షిన్ హే-సన్ నటన హైలైట్‌గా నిలిచింది. 30 ఏళ్ల వయసులో ఉండి 17 ఏళ్ల అమ్మాయిలా ఆమె చూపించిన అమాయకత్వం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈమె నటనకు గాను 2018 SBS డ్రామా అవార్డ్స్‌లో ‘టాప్ ఎక్సలెన్స్ అవార్డ్’ దక్కింది. అలాగే ఈ రోజుల్లో పెద్ద స్టార్‌గా ఎదిగిన అన్ హ్యో-సెప్ ఈ సిరీస్‌లో హీరో మేనల్లుడిగా నటించి ‘బెస్ట్ న్యూ యాక్టర్’ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఈ డ్రామాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కి తీసుకెళ్తాయి. ‘షీ వజ్ ప్రెట్టీ’ వంటి హిట్ డ్రామాలు రాసిన జో సుంగ్-హీ ఈ కథను అందించడం వల్ల ఇందులో కామెడీ, సెంటిమెంట్ చాలా సహజంగా ఉంటాయి. ఈ సిరీస్ మొత్తం 32 ఎపిసోడ్‌లతో ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, Viki ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

వూ సో-రీ అనే 17 ఏళ్ల అమ్మాయి వయొలిన్ వాయించడంలో అద్భుతమైన ప్రతిభ ఉన్న పిల్ల. తను ఒక బస్సు ప్రమాదంలో చిక్కుకుని కోమాలోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో, వూ-జిన్ అనే అబ్బాయికి ఆమెపై క్రష్ ఉంటుంది. ఆ ప్రమాదం తన వల్లే జరిగిందని, ఆ అమ్మాయి చనిపోయిందని వూ-జిన్ తప్పుగా అనుకుంటాడు. ఆ భావనతో అతను ఎవరితోనూ మాట్లాడకుండా ఒక వింత మనిషిలా మారిపోతాడు. కట్ చేస్తే.. కళ్లు తెరిచేసరికి 13 ఏళ్లు గడిచిపోతాయి. బయట ప్రపంచం మొత్తం మారిపోతుంది, తనకి మాత్రం ఇంకా తను 17 ఏళ్ల పిల్లననే ఫీలింగ్ ఉంటుంది. కానీ అద్దంలో చూసుకుంటే 30 ఏళ్ల ముదురు అమ్మాయి కనిపిస్తుంది. పాపం, ఆ వయసులో ఉండాల్సిన తెలివితేటలు లేక, బయట లోకం తెలియక చాలా ఇబ్బంది పడుతుంది.

తన తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ కనిపించరు. తన పాత ఇంటికి వెళ్తే, అక్కడ ఇప్పుడు వూ-జిన్ తన మేనల్లుడు యు-చాన్‌తో కలిసి నివసిస్తుంటాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న సో-రీని చూసి, యు-చాన్ జాలిపడి ఇంట్లోనే ఉండనిస్తాడు. వూ-జిన్‌కి మొదట్లో ఇది నచ్చకపోయినా, ఆమె అమాయకత్వం చూసి మెల్లగా కరుగుతాడు. సో-రీ తన వయొలిన్ కెరీర్‌ని మళ్ళీ మొదలుపెట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వూ-జిన్ ఆమెకు అండగా నిలుస్తాడు. ఒకానొక దశలో, వీరిద్దరికీ ఆ పాత ప్రమాదం గురించి అసలు నిజాలు తెలుస్తాయి. ఆ రోజు చనిపోయింది సో-రీ కాదని, ఆమె స్నేహితురాలని వూ-జిన్ తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. అలాగే తనని చిన్నప్పటి నుండి ఇష్టపడింది వూ-జిన్ అని సో-రీ గుర్తిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మనసులు కలవడంతో ఈ కథకు శుభం కార్డ్ పడిపోతుంది.

Advertisement

Read Also : ఆస్తి కావాలంటే ఆ పనులు చేయాల్సిందే… నెట్‌ఫ్లిక్స్ లో సెన్సేషనల్ మూవీ

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×