OTT Movie : గత కొంతకాలం నుంచి ఓటీటీలో ఎక్కువగా హర్రర్, క్రైమ్, కామెడీ సినిమాల హవా నడుస్తోంది. అయితే వాటికంటే ఎక్కువగా ఒంటరిగా చూసే సినిమాలను కూడా యూత్ బాగా ఇష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీలలో ఇలాంటి కంటెంట్ ఎంత కావాలంటే అంత అవైలబుల్ గా ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ 45 ఏళ్ల మహిళతో 25 ఏళ్ల కుర్రాడు అలాంటి పాడు పనులు చేసే స్టోరీతో నడుస్తుంది. నిజానికి ఇదొక లవ్ స్టోరీ. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పక్కా హాలీవుడ్ కంటెంట్. అద్భుతమైన స్టోరీతో రూపొందిన ఈ క్రేజీ రొమాంటిక్ లవ్ స్టోరీకి మైఖేల్ షోల్టర్ దర్శకత్వం వహించారు. అన్నే హాత్వే, నికోలస్ గలిట్టైన్ మెయిన్ లీడ్స్ గా నటించారు. రాబిన్లీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చెప్పుకోవడానికి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అయినప్పటికీ, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇలాంటి సినిమా ఓటీటీలోకి వచ్చింది అంటే చూడడానికి అందరూ ఎగ్జైట్ అవుతూ ఉంటారు.
కానీ ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడలేము. ఒంటరిగా చూడాలి, లేదంటే భార్య భర్తతో… భర్త భార్యతో… ప్రేమికుడు ప్రియురాలితో… ప్రియురాలు ప్రేమికుడితో మాత్రమే చూడగలిగే సినిమా. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ క్రేజీ రొమాంటిక్ మూవీని ఇప్పటిదాకా చూడకపోతే వెంటనే ఒక లుక్కెయ్యండి.
కథలోకి వెళ్తే… ఈ సినిమాలో 40 ఏళ్ల మహిళ ఉంటుంది. ఆమె భర్త చనిపోతాడు. దీంతో కూతుర్ని చూసుకుంటూ ఒక్కతే కాలం వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు 24 ఏళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. ఆ తర్వాత ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ వీరిద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. మరి ఈ విషయం ఆమె కూతురికి తెలిసిందా? ఆ తర్వాత ఇద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరికి వీళ్ళ ప్రేమకథ ఎక్కడికి దారి తీసింది? అనే విషయాలు తెలియాలంటే ‘ది ఐడియా ఆఫ్ యు’ (The Idea of You) అనే ఈ హాలీవుడ్ మూవీని చూడాల్సిందే. అయితే ఒంటరిగా చూడాలి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.
ఈ సినిమాలో కొన్ని పెద్దలు మాత్రమే చూడాల్సిన సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అందరి ముందు ఈ సినిమా చూశారంటే అంతే సంగతులు. నటీనటులు తమ పాత్రలో జీవించడంతో తెలియని ముఖాలే అయినా మూవీ ఇంట్రెస్టింగ్ గా అన్పిస్తుంది. మరి రొమాంటిక్ మూవీ లవర్స్ ఇప్పటిదాకా ఈ సినిమా (The Idea of You) చూడకుండా మిస్ చేసి ఉంటే అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.