E-Paper
Advertisement

గ్లాడియేటర్ స్టార్ రస్సెల్ క్రో కొత్త మూవీ ‘బీస్ట్’… తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్

గ్లాడియేటర్ స్టార్ రస్సెల్ క్రో కొత్త మూవీ ‘బీస్ట్’… తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్
Advertisement

Hollywood Action Movie: స్పోర్ట్స్ డ్రామా సినిమాలు అంటే కేవలం ఫైట్లు మాత్రమే కాదు, వాటి వెనుక దాగి ఉండే భావోద్వేగాలు, జీవిత పోరాటాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ కలగలిపిన హాలీవుడ్ చిత్రం ‘బీస్ట్’ (Beast). ఆస్కార్ అవార్డు గ్రహీత రస్సెల్ క్రో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా 2026 ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో పలు భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. మరి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒకప్పుడు ప్రపంచస్థాయి ఎమ్‌ఎమ్‌ఏ ఫైటర్‌గా పేరు తెచ్చుకున్న ప్యాటన్ జేమ్స్, అనుకోని సంఘటనల తర్వాత ఫైటింగ్ ప్రపంచానికి పూర్తిగా దూరమవుతాడు. గతాన్ని మరచిపోయి సముద్రతీరంలో సాధారణ మత్స్యకారుడిగా ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. ఇక తన జీవితంలో మళ్లీ రింగ్‌ లోకి అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్న సమయంలో అతని జీవితాన్ని మార్చేసే ఒక సంఘటన జరుగుతుంది.

Advertisement

అండర్‌వరల్డ్ ముఠాతో జరిగిన గొడవ కారణంగా అతని తమ్ముడు తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఎంత ప్రయత్నించినా చట్టపరంగా అతడిని కాపాడే పరిస్థితి కనిపించదు. చివరకు తన తమ్ముడి ప్రాణాలను రక్షించాలంటే మళ్లీ ఫైటింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిందేనని ప్యాటన్ గ్రహిస్తాడు. అక్కడే రంగప్రవేశం చేస్తాడు అతని పాత గురువు శ్యామీ. ఈ పాత్రలో రస్సెల్ క్రో తన అనుభవంతో ఆకట్టుకుంటాడు.

చాలా కాలంగా ఫైటింగ్‌కు దూరమైన ప్యాటన్‌ను మళ్లీ కేజ్ ఫైట్‌కు సిద్ధం చేయడానికి కఠినమైన శిక్షణ ప్రారంభిస్తాడు. ఒకవైపు శారీరకంగా, మరోవైపు మానసికంగా కుంగిపోయిన శిష్యుడిలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తాడు. అంతిమంగా ప్యాటన్‌కు ఎదురయ్యేది వన్ ఛాంపియన్‌షిప్‌లో అజేయ ఛాంపియన్ జేవియర్ గ్రౌ. ప్రపంచం మొత్తం చూస్తున్న ఆ ఫైట్‌లో అతను గెలిచాడా ? తన తమ్ముడిని అండర్‌వరల్డ్ నుంచి కాపాడగలిగాడా ? గురువు-శిష్యుల బంధం ఈ పోరాటంలో ఎలా నిలిచింది ? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా క్లైమాక్స్.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

ఈ సినిమాకు ప్రధాన బలం ఎమ్‌ఎమ్‌ఏ ఫైట్ సన్నివేశాలు. ప్రతి ఫైట్ చాలా సహజంగా, నిజమైన ఛాంపియన్‌షిప్‌ను చూస్తున్న అనుభూతి కలిగేలా తెరకెక్కించారు. రస్సెల్ క్రో స్క్రీన్ ప్రెజెన్స్, గురువుగా ఆయన చెప్పే డైలాగులు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. డానియల్ మాక్‌ఫెర్సన్ తన పాత్రలో పూర్తి స్థాయిలో ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు కుటుంబ బంధాలు, గురువు-శిష్యుల అనుబంధాన్ని కూడా దర్శకుడు చక్కగా చూపించాడు. ‘బీస్ట్’ ప్రస్తుతం JioHotstar ఓటీటీలో తెలుగు డబ్బింగ్‌తో పాటు హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పోర్ట్స్ డ్రామాలు, మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అంటే ఇష్టమైతే ఈ సినిమా మీ కోసమే. ఉత్కంఠభరితమైన ఫైట్లు, బలమైన గురువు-శిష్యుల బంధం, చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే కథనం ఈ సినిమాను ఒక మంచి వీకెండ్ వాచ్‌గా నిలబెడుతుంది.

Read Also: సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Tags

Related News

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

రూ.550 కోట్ల హారర్ బ్లాక్‌బస్టర్… ‘ఈవిల్ డెడ్ బర్న్’ ఏకంగా 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్

94 శాతం ఫ్రెష్ రేటింగ్‌ ఉన్న హాలీవుడ్ ఇంటెన్స్ థ్రిల్లర్… తెలుగులోనే ఇప్పుడు రెండు ఓటీటీల్లో

బావిలో దొరికిన మహిళ శవం… దర్యాప్తులో బయటపడిన భయంకర రహస్యం

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఓ సుకుమారి.. ఎక్కడ చూడొచ్చంటే?

Big Stories

Advertisement
×